రాజకీయాల్లో మార్పులు.. చేర్పులు కామన్. అవసరం-అవకాశం అనే రెండు పట్టాలపైనే రాజకీయ ప్రయా ణాలు సాగుతాయి. పార్టీలైనా.. నాయకులైనా.. ఎవరైనా కూడా.. ఈ సూత్రాన్నే పాటిస్తారు. రాజకీయాల్లో శత్రువులు అంటూ ఎవరైనా ఉన్నారంటే.. వారు కేవలం.. పార్టీల అధినేతలు మాత్రమే. అధినేతలు మాత్రమే ఒకరికొకరు బద్ధ శత్రువులు. నాయకులు మాత్రం ప్రత్యర్థులే. సో.. అందుకే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరని అంటారు.
ఈ నేపథ్యంలోనే రాజకీయ నేతలు.. తమకు అవకాశం ఉన్నచోటకు వెళ్తారు. తమకు అవసరం ఉన్న వి ధంగా వ్యవహరిస్తారు. అయితే.. దీనిని తాజాగా వైసీపీ నాయకులు తప్పుబడుతున్నారు. తప్పు బడుతు న్న వారు కూడా.. ఒకప్పుడు వేరే వేరే పార్టీల్లో చక్రాలు తిప్పిన వారే. సరే.. వీరు చెబుతున్నది ఏంటంటే.. వైసీపీ నుంచి బయటకు వచ్చిన వారు బాగుపడినట్టు చరిత్రలో ఎక్కడా లేదని అంటున్నారు. అందుకే పోయేవారిని తాము ఆపబోమని కూడా సెలవిస్తున్నారు.
సరే.. ఈ విషయాన్ని పరిశీలిస్తే.. నిజంగానే వైసీపీ నుంచి బయటకు వెళ్లిన వారు.. బాగుపడలేదా? అంటే.. బాగు పడ్డారనే చెప్పాలి. వైసీపీ నుంచి బయటకు వచ్చిన వారు.. చాలా మంది ప్రస్తుత చంద్రబాబు మం త్రివర్గంలో మంత్రులు అయ్యారు. కొందరు ఎమ్మెల్యేలుగా.. ఎంపీలుగా కూడా విజయం దక్కించుకున్నా రు. ఉదాహరణకు ఆనం రామనారాయణరెడ్డి.. వైసీపీ నుంచి బయటకు వచ్చి.. టీడీపీ తీర్థం పుచ్చుకుని.. ఆత్మకూరులో విజయం దక్కించుకున్నారు. ప్రస్తుతం మంత్రి అయ్యారు.
గొట్టిపాటి రవికుమార్.. 2017లోనే వైసీపీ నుంచి బయటకు వచ్చి.. టీడీపీ తీర్థం పుచ్చుకుని వరుసల విజ యాలతో తాజాగా మంత్రి అయ్యారు. కొలుసు పార్థసారథి.. గత ఎన్నికలకుముందు వైసీపీతో విభేదించి బయటకు వచ్చి.. నూజివీడు నుంచి విజయం దక్కించుకుని మంత్రి పదవి చేపట్టారు. ఇలా.. చాలా మందే ఉన్నారు. ఇక, ఎంపీ టికెట్ ఇవ్వనని చెప్పిన వారు కూడా బయటకు వచ్చి.. టీడీపీలో , జనసేనలో చేరి టికెట్ దక్కించుకుని ఎంపీలయ్యారు. కాబట్టి.. వైసీపీ నుంచి బయటకు వచ్చిన వారు వేస్ట్ అయ్యారన్నది ఆ పార్టీ నాయకుల భ్రమే తప్ప.. మరొకటి కాదు!! రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.. కానీ, ప్రజా తీర్పే ప్రామాణికం.