ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికారం మాకంటే మాకే కావాలని.. అన్ని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. ఏపీలో సందడి చేస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే..పార్టీలు హల్చల్ చేస్తున్నాయి. ప్రజలను కలుసుకుంటున్నాయి. అయితే.. ఏపీ ప్రజలు ఏం కోరుతున్నారు? ఎలాంటి డిమాండ్ల అస్త్రాలు వారి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి? అనేది ప్రధానంగా చర్చకు వస్తోంది.
ఇప్పుడు ఏపీ ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాలను కలిసిపోవాలని కోరుకోవడం లేదు. పైగా.. తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లు అయిపోయింది. సో.. ఇప్పుడు ఏపీ ప్రజలకు కావాల్సింది.. ఊరట. అంటే.. విభజన చట్టం లో పేర్కొన్న ఏ విధమైన సౌలభ్యాలు, సౌకర్యాలు ఉన్నాయో.. వాటిని పూర్తిగా తమకు అందించడమే వారు కోరుతున్నారు. దీనిలో ప్రత్యేక హోదా కావొచ్చు.. ఇతరత్రా ఏదైనా కావొచ్చు. మొత్తానికి వారు రాష్ట్రాలు కలుసుకోవాలని కోరుకోవడం లేదు.
కానీ, జరిగిన నష్టాన్ని మాత్రమే భర్తీ చేయాలని.. ప్రత్యేక హోదాను సాధించాలని, పారిశ్రామికంగా ఆర్థికం గా రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాలని.. మాత్రమే ఏపీ ప్రజలు కోరుతున్నారు. అంతకు మించి ఎప్పుడో జరిగిపోయిన విభజన తాలూకు వివాదాలను రెచ్చగొట్టడం కానీ, రెండు తెలుగు రాష్ట్రా ల ప్రజల మధ్య రచ్చ చేయడం కానీ వారు కోరుకోవడం లేదు. ప్రస్తుతం ఎవరి మానాన వారు పనులు చేసుకుంటున్నారు.
కానీ, రాజకీయ నాయకులు మాత్రమే తమ పబ్బం గడుపుకొనేందుకు సమైక్య రాష్ట్రం అయితే బాగుటుంది. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసిపోవాలి.. అని వాదనను తెరమీదికి తెస్తున్నారు. దీనికికారణం.. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న విషయాలను.. డిమాండ్లను వారు సాధించలేకపోవడమే. అందుకే ప్రజలు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ఏపీకి ఏం చేయాలో అది చేయడం చాలు! అని రియాక్ట్ అవుతున్నారు.