తెలంగాణ రాజకీయాల్లో పుంజుకోవాలని.. పాత నేతలు తిరిగి రావాలని.. టీడీపీ అధినేత చంద్రబాబు పదే పదే విన్నవిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. పార్టీ పుంజుకుంటుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలావుంటే.. ఇప్పుడు చంద్రబాబు తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తారా.? లేక .. పొత్తు పెట్టుకుంటారా? అనే చర్చతెరమీదికి వచ్చింది.
పొలిటికల్ వర్గాల్లో జోరుగా సాగుతున్న ఈ చర్చను పరిశీలిస్తే.. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని.. అంటున్నారు. 2018 ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు.. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. అయితే.. దానిని సెంటిమెంటుగా మార్చుకున్న కేసీఆర్ అండ్ కో.. సునాయాసంగా విజయం దక్కించుకున్నారు. ఇక, ఆ తర్వాత కాంగ్రెస్తో దూరంగా ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు బీజేపీకి చేరువయ్యారనే విషయం తెలిసిందే.
అయితే.. తాము తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న విషయాన్ని బీజేపీ చంద్రబాబు కు చెప్పిందని.. ఈ క్రమంలో అక్కడ బాబు సాయం కోరిందని.. కొన్నాళ్లుగా తెలంగాణలో రాజకీయ చర్చలు సాగుతున్నాయి. అయితే.. ఇవి ఇంకా సర్దుమణగకముందే..చంద్రబా
ఇక, ఈ క్రమంలోనే చిన్న రాష్ట్రాలకు అనుకూలం అని చెప్పే బీజేపీ మాటను..చంద్రబాబు వల్లె వేశారు. ఇన్నాళ్లలో ఎప్పుడూ.. కూడా రాష్ట్ర విభజన విషయాన్ని ప్రస్తావించని చంద్రబాబు.. తాజాగా విభజన విషయాన్ని నేరుగా ప్రస్తావించకపోయినా.. ఒకసారి జరిగిన విభజనను ఎలా వ్యతిరేకిస్తారని.. రెండు రాష్ట్రాలుకలవడం అసంభవమని వ్యాఖ్యానించి.. తెలంగాణ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే.. ఇదంతా కూడా బీజేపీ వ్యూహమేనని.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ తో కలిసిచంద్రబాబు నడిచేందుకు వేసుకుంటున్న బాట అని కొందరు మేధావులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.