ఏపీలో వచ్చే ఎన్నికలు పార్టీల బలాబలాల కన్నా కూడా సంక్షేమ పథకాలు.. సంక్షేమ మేనిఫెస్టో, అభివృద్ధి దిశగా కొనసాగుతుందా? అంటే అవును అని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వాతావరణ పూర్తిస్థాయిలో మారిపోయింది. సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని చెప్తున్నటువంటి వైసీపీని బలంగా ఢీకొని విజయం సాధించే దిశగా టిడిపి నాయకులు ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టోను ప్రకటించారు.
అంటే దీన్నిబట్టి మరింత సంక్షేమం దిశగా వైసిపి అడుగులు వేయాల్సి ఉంటుంది. అయితే ఇది సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కాదు. ఇప్పటివరకు చేసినటువంటి అప్పులు దాదాపుగా ఏడు లక్షల కోట్ల రూపాయలు దాటిపోయిందని కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తుండగా అనధికారికంగా తెచ్చినటువంటి మరో అయిదు ఆరు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో అప్పులుగా ఉన్నాయి. కాబట్టి వైసిపి ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేటటువంటి అవకాశం లేదు.
ప్రస్తుతం ప్రకటించినటువంటి టిడిపి మేనిఫెస్టో నే అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో వచ్చే ఎన్నికలు సంక్షేమ రణ రంగాన్ని తలపించునున్నాయి అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని గమనించినట్లయితే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు మాత్రమే పేటెంట్ హక్కుగా భావిస్తున్నటువంటి వైసీపీని బలంగా దెబ్బ కొట్టాలనే వ్యూహంతో చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి లైన్, మినీ మేనిఫెస్టో ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీంతో ఇప్పటివరకు దేన్నయితే వైసిపి నమ్ముకుని ముందుకు అడుగులు వేసిందో ఆ ఓటు బ్యాంకు కదలి భారీగా టిడిపికి అనుకూలంగా మారేటటువంటి పరిస్థితి నెలకొంది.
దీంతో వచ్చే ఎన్నికలు కచ్చితంగా మరింత పోటాపోటీగా నువ్వా నేనా అన్నట్టుగా సాగడం ఖాయం అనేటటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం గడపగడపకు కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువ అయ్యేలా ఎమ్మెల్యేలను తెప్పింది. అయితే ఇప్పుడు సంక్షేమమే ప్రధానంగా మారిపోయింది. ఈ రెండు మూడు రోజులు పరిస్థితిని గమనించినట్లయితే మినీ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ప్రజల మూడ్ టిడిపి వైపు వెళ్ళుతున్నట్టుగా వైసిపి నాయకులు చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికలు కచ్చితంగా ఈ వైసీపీ వర్సెస్ టిడిపి మధ్య భయంకరమైనటువంటి పోటీ ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.