అవును.. టీడీపీ ఇలా చేసి ఉంటే.. బాగుండేదేమో.. అని మేధావులు అంటున్నారు. ఎందుకంటే.. పార్టీ కింద నుంచి పైకి డెవలప్ కావాలి. కానీ, ఇప్పుడు అనుసరిస్తున్న వ్యూహం పైనుంచి కిందికి అన్నట్టుగా ఉందని అంటున్నారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని అంచనావేసుకుని.. దానిని బట్టి.. టీడీపీ వ్యవహరించాలి. కానీ ఇప్పుడు అలా లేదు. ముందు పైస్థాయిలో కొన్ని నిర్ణయాలు తీసుకుని.. ఇప్పుడు క్షేత్రస్తాయిలో పరిస్థితిపై అంచనా వేస్తోంది.
ఉదాహరణకు మహానాడు నిర్వహించారు. దీనికి ముందు ఒక ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది. కానీ, అలా చేసుకోకుండానే వ్యూహం లేకుండా.. దీనిని నిర్వహించేశారు. తర్వాత.. కొందరు చేసిన సూచనలతో మహానాడు తర్వాత.. మినీ మహానాడులు నిర్వహించాలని తీర్మానం చేశారు.
వాస్తవానికి ముందుగా మినీ మహానాడులు నిర్వహించుకుని ఉంటే బాగుండేదని అంటున్నారు. ఎందుకంటే.. ముందుగా మినీ మహానాడులు నిర్వహిస్తే.. అక్కడి సమస్యలపై చర్చించేందుకు అవకాశం ఉండేది.
వాటిని మహానాడులో చర్చించి.. ఆయా సమస్యలకు అనుగుణంగా.. ననిర్ణయాలు.. తీర్మానాలు చేస్తే.. నాయకులు, కార్యకర్తల్లో మరింత జోష్ పెరిగి ఉండేదని అంటున్నారు. తాజాగా వైసీపీ ఇదేపంథాను అను సరించింది. ముందుగా క్షేత్రస్థాయిలోనియోజకవర్గా
అనంతరం గుంటూరు వేదికగా ప్లీనరీ నిర్వహించింది. దీంతోక్షేత్రస్థాయిలో సమస్యలను కూడా క్రోడీకరించి .. వాటి పరిష్కారానికి కొన్ని తీర్మానాలు ప్రకటించారు.
ఇలా చేయడం వల్ల.. పార్టీలో ఒక జోష్ కనిపించిందనేది వాస్తవం. ఇప్పుడు టీడీపీలో ఇదంతా రివర్స్‌లో జరుగుతోంది. ముందుగానే ప్రధాన మహానాడు నిర్వహించి..తర్వాత.. మినీ మహానాడులు నిర్వహిస్తున్నా రు. దీంతో క్షేత్రస్థాయి సమస్యలపై మహానాడు వంటి కీలక సమావేశంలో చర్చించేందుకు అవకాశం లేకుండా పోయింది.
దీనివల్ల.. పార్టీలో నేతలు ఒకింత నిరాశలో ఉన్నారు. ముందుగానే తమ సమస్యలు విని.. తర్వాత.. పరిష్కారం చూపిస్తే.. బాగుండేదని అంటున్నారు.
అయితే.. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. ఈ ఏడాది అంతా కూడా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నందన వచ్చే మహానాడు మరింత కీలకం కానుందని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో అప్పుడు ఆయా సమస్యలకు పరిష్కారం చూపిస్తారని చెబుతున్నారు.