ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయాలు తర్జన భర్జనగా ఉన్నాయి. గత ఎన్నికల్లో కేవలం రెండు తప్ప. మిగిలిన అన్ని స్తానాలను తనవైపు అనుకూలంగా మలుచుకున్న వైసీపీకి ఇప్పుడు గడ్డు పరిస్థితి ఏర్పడిం ది. కొందరు నాయకులు చేస్తున్న దూకుడు రాజకీయాలు, వనరుల దోపిడీ, బూకబ్జాలు, అవినీతి ఆరోపణలు వంటివి.. వారినే కాకుండా వైసీపీని కూడాఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. వీరిని మార్చాలని స్థానిక నాయక త్వం కోరుతున్నా.. అధిష్టానం మౌనంగా ఉంది.
ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాలో వైసీపీ ప్రధానంగా ఐదు స్థానాలను కోల్పోవడం ఖాయమనే చర్చ జోరుగా సాగుతోంది. “అక్కడా.. ఈ సారి టీడీపీనే గెలుస్తుంది“ అనే మాట.. టీకొట్లు.. నాలుగు రోడ్ల సెంట ర్లలో ఏ నలుగురు గుమిగూడినా వినిపిస్తోంది. అంతేకాదు.. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా.. ఈ నియోజకవర్గా లపైనే చర్చించుకుంటున్న పరిస్తితి కనిపిస్తోంది. మరి ఆ ఐదు నియోజకవర్గాలపై అధిష్టానం కన్నేసిందా? అంటే.. లేదనే చెప్పాలి.
దీనికి ప్రధాన కారణం.. వారంతా వైసీపీకి కావాల్సిన వారు! ఆశ్చర్యంగా అనిపించినా.. నిజమేనని లోకల్ టాక్. రాప్తాడు, కళ్యాణదుర్గం, పుట్టపర్తి, తాడిపత్రి, పెనుకొండ నియోజకవర్గాల్లో మార్పు తథ్యమనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఇక్కడ పార్టీలోనే అంతర్గత కుమ్ములాటలు ఉండడం ఒక వరసైతే.. మరోవైపు.. ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత రావడం.. మరో లెక్కగా ఉంది. దీంతో ఈ ఐదు నియోజకవర్గాలు ఈ దఫా టీడీపీ ఖాతాలో పడతాయని అంటున్నారు.
రాప్తాడు నుంచి ఎట్టకేలకు గత ఎన్నికల్లో వైసీపీ గెలిచినా.. ఆ మేరకు ప్రజాభిమానం పార్టీ సొంతం చేసుకోలేక పోయింది. కళ్యాణదుర్గంలో గెలిచిన నాయకురాలిని మంత్రిని చేసినా.. వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టంగా మారింది. బీసీలు దూరమయ్యారనే వాదన వినిపిస్తోంది. పుట్టపర్తిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక, తాడిపత్రి నియోజకవర్గం కక్ష సాధింపులకు వేదికైందనే వాదన సొంత నేతల్లోనే వినిపిస్తోంది., పెనుకొండలో మాజీ మంత్రి వర్యులకు అసుల వాల్యూలేకుండా పోయిందని అంటున్నారు. ఇదీ.. సంగతి!