టీడీపీ కేడర్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది. గుడివాడ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది.
కెసినో నిర్వహించిన వారిని ఇంతవరకు అరెస్టు చేయకపోవడంతో పాటు తప్పు చేసిన వారు చంద్రబాబును బూతులు తిడుతుంటే చోద్యం చూస్తున్న డీజీపీకి తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్న తిరుగులేని వార్నింగ్ ఇచ్చారు.
‘‘డీజీపీ అంటే డైరెక్టర్ ఆఫ్ జగన్ పార్టీగా మార్చావు. భారతదేశ చరిత్రలో ఒక పార్టీకి ఇంత బానిసత్వం చేసిన డీజీపీ నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. నీకు ఇపుడే చెబుతున్నా… వచ్చే ఏడాదో ఆ తర్వాతో నీ టర్మ్ అయిపోతుంది.
నువ్వు ఈ రాష్ట్రంలో ఎక్కడున్నా నిన్ను కూడా వదిలే ప్రసక్తే లేదు. ఓపెన్ గా చెబుతున్నా ఇందులో. మీరు నన్ను ఏం చేస్తారో చేస్కోండి. నన్ను అరెస్టు చేసుకోండి. లేదా తప్పులు కేసులు పెట్టుకుంటారా? నా ఆస్తులు మీద దాడి చేసుకుంటారా? లేదా నన్ను చంపుతారా.? మీ ఇష్టం వచ్చింది చేస్కోండి. నన్ను చంపేయండి. లేదా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మిమ్నల్ని ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు ఎక్కడ దాక్కున్నా సరే‘‘ అంటూ బుద్ధా వెంకన్న డీజీపీకి ఓపెన్ వార్నింగ్ ఇచ్చేవాడు.
మొత్తానికి బుద్ధా వెంకన్న వ్యాఖ్యలు వైరల్ అయిపోయాయి.
https://youtu.be/TqK8gxJsZDQ