తెలుగుదేశం పార్టీ ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో హైటెక్ సిటీ నిర్మించి వేలాదిమంది ఐటీ నిపుణులను తయారు చేసిన ఘనత చంద్రబాబుది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే మిగతా పార్టీల సోషల్ మీడియా విభాగాలతో పోలిస్తే టీడీపీ సోషల్ మీడియా విభాగం చాలా బలంగా ఉంటుంది. దానికితోడు అంకితభావంతో పార్టీ కోసం కష్టపడి పనిచేసే అభిమానులు సోషల్ మీడియా వారియర్స్ గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
దీంతో వైసిపి ప్రభుత్వ పాలనను, జగన్ నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో టిడిపి సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్స్ యాక్టివ్ గా ఉంటాయి. అయితే, టీడీపీ, ఐటీడీపీ అఫీషియల్ ట్విటర్ హ్యాండిల్స్ నుంచి మామూలుగా పోస్టులు పెడుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా టిడిపి ట్విట్టర్ హ్యాండిల్ హ్యాకింగ్ కు గురైంది. టిడిపి అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ గురించి టైప్ చేస్తే…టేలర్ అనే అకౌంటు ప్రత్యక్షమవుతుంది.
మామూలుగా అయితే టిడిపి అని కొట్టగానే జై టీడీపీ అనే ట్విట్టర్ హ్యాండిల్ ఓపెన్ అవుతుంది. కానీ, ప్రస్తుతం ఆ టైలర్ అకౌంట్ అయి..అందులో విజువల్ ఆర్ట్స్ కు సంబంధించిన పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం పై టిడిపి మరో ట్విట్టర్ హ్యాండిల్ ఐటీడీపీ స్పందించింది .టిడిపి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ను వైసిపి అండదండలతో కొన్ని నికృష్టపు శక్తులు హ్యాకింగ్ చేసి ఉంటాయని ఐటీడీపీ ఆరోపించింది. త్వరలోనే టీడీపీ అఫీషియల్ ట్విటర్ హ్యాండిల్ ను పునరుద్ధరిస్తామని ఐటీడీపీ వెల్లడించింది.