ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఈ మధ్యే రాష్ట్రంలోని కొన్ని ప్రధాన నగరాల్లో మెగా జాబ్ మేళాల పేరుతో హడావుడి చేసింది. రాష్ట్రంలో నిరోద్యోగిత అంతకంతకూ పెరిగిపోయి యువతలో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్న తరుణంలో ఏదో కంటితుడుపుగా ఈ మేళాలు చేపట్టారని అందరికీ తెలుసు.
అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలే ఉద్యోగాలు అని ఊదరగొట్టి.. ఆ తర్వాత 5 వేల జీతానికి పార్టీ కార్యకర్తలకు వాలంటీర్ పోస్టులివ్వడం, వాటిని చూపించి లక్షల ఉద్యోగాలిచ్చామని చెప్పుకోవడం, అలాగే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకుని అవి కూడా కొత్త ఉద్యోగాల లెక్కల్లో చూపించడం తప్పితే.. ఏపీలో ఉద్యోగాల కల్పన శూన్యం అని అందరికీ తెలుసు.
ఈ నేపథ్యంలో వ్యతిరేకత తట్టుకోలేక జాబ్ మేళాలు పెట్టారు. కానీ అక్కడ చూస్తే ప్రధానంగా సెక్యూరిటీ గార్డులు, ఇంకేవో చిన్న చిన్న ఉద్యోగాలు తప్పితే.. ఒక స్థాయి ఉన్న ఉద్యోగాలు చాలా తక్కువ. అదే తెలుగుదేశం పార్టీ ఉద్యోగాల కల్పనలో ఎంత ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తుందో.. చంద్రబాబు విజన్ ఎలా ఉంటుందో.. ఆయన ఎంత దూరదృష్టితో వ్యవహరిస్తారో.. ఉమ్మడి రాష్ట్ర, విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన కియా సహా ఎన్నో పరిశ్రమల్ని రాష్ట్రానికి తీసుకురావడం, అలాగే వివిధ కార్పొరేషన్ల ఏర్పాటుతో ఏ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించారో అందరికీ తెలుసు.
పార్టీ తరఫున ఏ కార్యక్రమాలు చేసినా కూడా అందులో ఒక ప్రొఫెషనలిజం కనిపిస్తుంది. ఇప్పుడు ఆ పార్టీ చేపడుతున్న ఓ మంచి కార్యక్రమం చూస్తే.. వాళ్ల వ్యవహారం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. మహిళల కోసం ప్రత్యేకంగా టీడీపీ పొలిటికల్ ఇంటర్న్షిప్స్ ప్రవేశ పెట్టింది.
గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశం పొందిన వాళ్లు.. డిగ్రీ చదువు చివర్లో ఉన్న వాళ్లు.. ఇందులో ఎన్రోల్ చేసుకోవచ్చు. దేశంలో రాజకీయ నిర్మాణం ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్న వాళ్లు ఇందులో చేరొచ్చు. ప్రొఫెషనల్‌గా పార్టీని నిర్వహించే టీడీపీలో ఇంటర్న్‌షిప్ చేస్తే దేశ రాజకీయ పరిస్థితులపై, అలాగే రాజకీయ పార్టీల నిర్మాణంపై సమర్థమైన అవగాహన వస్తుంది.
ఎన్నికల ప్రచారం ప్లానింగ్, సోషల్ మీడియా నిర్వహణ, రీసెర్చ్-అనాలసిస్, పొలిటికల్ కంటెంట్ క్రియేషన్, ఎన్నికల పరిశీలన, గ్రాఫిక్-వెబ్ డిజైనింగ్ లాంటి అంశాలపై ఈ ఇంటర్న్‌షిప్‌లో అవగాహన కల్పిస్తారు. ఈ ఇంటర్న్‌షిప్ పూర్తి చేస్తే పొటిలికల్ సిస్టమ్‌లో ఉపాధి పొందడానికి మంచి అవకాశాలు ఉంటాయి. మహిళల కోసం ఇలాంటి అవకాశం కల్పించడం టీడీపీ మాత్రమే చేయగలదు అనడంలో మరో మాట లేదు.
Be the Part of South India's first-ever Women Political Internship by Telugu Desam Party , where you will not only learn Politics and Leadership but also build Connections. Experience the journey where you Dream, Discover and Develop along with us at TDP. pic.twitter.com/m92rM7mWe0
— Telugu Desam Party (@JaiTDP) May 2, 2022