టీడీపీ నేత, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారంటూ ఆదిమూలంపై టీడీపీ మహిళా కార్యకర్త చేసిన ఆరోపణలు దుమారం రేపాయి. తిరుపతిలోని ఓ హోటల్లో తనపై ఆదిమూలం లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మీడియా ముందు ఆ వీడియో విడుదల చేసిన వైనం షాకింగ్ గా మారింది.
ఆదిమూలంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు ఆమె ఫిర్యాదు చేసింది. చంద్రబాబుకు రాసిన లేఖను, ఆదిమూలం రాసలీలల వీడియోను తన భర్తతో కలిసి మీడియా ముందు పెట్టింది. ఈ క్రమంలోనే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేశామని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు.
జూలై నెలలో రెండుసార్లు, ఆగస్టులో ఒకసారి తనను బెదిరించి లొంగదీసుకున్నారని, అత్యాచారానికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. తనకు లొంగకపోతే తన కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించారని ఆరోపించింది. చివరకు ఈ విషయం భర్తకు చెప్పగా…ఆదిమూలం బండారం బయటపెట్టాలని సూచించారని, అందుకే పెన్ కెమెరాలో ఆ రాసలీలలను రికార్డ్ చేశానని చెప్పింది. ఆదిమూలంపై చర్యలు తీసుకోవాలని కోరింది.