మరో రెండున్నరేళ్లలో ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. అయితే.. ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వం.. మధ్య లోననే రద్దు చేసుకుంటే.. ఎన్నికలు వచ్చే ఏడాది లోనే జరిగే ఛాన్స్‌ను తోసిపుచ్చలేం. దీంతో ప్రధాన ప్రతి పక్షం టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ అధికా రం దక్కిం చుకునే కసితో ముందుకు సాగుతోంది. దీనిని ఎవరూ తప్పు పట్టడం లేదు. కానీ.. అనుసరిస్తు న్న వ్యూహంలో నే కొన్ని లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నిక లు.. యూత్ సెంట్రిక్‌గానే జరగనున్నాయి.
దీనికి ప్రధాన కారణం.. ఏపీ ప్రభుత్వాధినేత, ముఖ్యమంత్రి జగన్‌ను యువనాయకుడిగా ప్రొజెక్టు చేస్తు న్నారు. గతంలో మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ.. ముఖ్యమంత్రి జగన్‌ను ఇలా సంబోధించిన సందర్భాలు చాలా తక్కువ. కానీ, ఇప్పుడు ఎక్కడ గళం విప్పినా.. `మా యువ ముఖ్యమంత్రి` అంటూ.. సంబోధిస్తున్నారు.
సో.. దీనిని బట్టి వచ్చే ఎన్నికల్లో యువతను సెంట్రిక్‌గా చేసుకుని.. సీఎం జగన్ వ్యూహా త్మకంగా పావులు కదుపుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే కురువృద్ధులతోపాటు 60 ఏళ్లు నిండిన వారిని పక్కన పెడతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని నిర్మొహమాటంగా చెబుతన్నారు.
మరోవైపు.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా.. యువతకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతోంది. 33 శాతం వారికి రిజర్వేషన్ కల్పిస్తామని.. చంద్రబాబు హామీ ఇచ్చి.. ఏడాది దాటిపోయింది. అయితే.. ఇప్పటి వరకు చూ సుకుంటే.. టీడీపీలో వారసులు లేరా? అంటే ఉన్నారు. ప్రతి జిల్లాలోనూ ఉన్నారు.కానీ.. వారు వారసులు గా అరంగేట్రం చేసిన వారే!!
“మీరు వయసు మీరారు.. తప్పుకుంటారా?“ అని చంద్రబాబు ఎవరిని అడిగినా.. “ఓకే! తప్పకుండా తప్పుకుంటాం.. కానీ.. మా సీటును మావాడికే ఇవ్వాలి!“ అని కురువృద్ధులు షరతు పెడుతున్నారు. అంటే.. టీడీపీ టికెట్ల విషయంలో అయితే..వారు.. కాకుంటే వీరు! అన్న విధంగా రాజకీయాలు సాగుతున్నాయి.
అంతేకాదు.. అధినేతపై అలిగేవారు.. ఆయనను బ్లాక్మెయిల్ చేయాలని చూసే వారు స్పష్టంగా కనిపి స్తున్నారు. దీంతో ఎవరిని పక్కన పెడితే.. ఏం జరుగుతుందో అనే భావనతో టీడీపీ అధినేత మల్లగుల్లాలు పడుతున్నారు.
కానీ, వైసీపీని తీసుకుంటే.. ఇలాంటి అలుగుళ్లు, బ్లాక్మెయిల్ రాజకీయాలకు.. జగన్ ఎక్కడికక్కడ తోకలు కట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తాను నిర్ణయించిన వారికే టికెట్ ఇస్తామని.. ఎవరూ సిఫారసులు చేయడం.. కొనసాగింపు లేఖలు రాయడం వంటివి చేయరాదని.. ఆయన ఇప్పటికే స్పష్టం చేసేశారు. దీనికి కారణం.. పార్టీని తన కనుసన్నల్లో ఉంచుకుని.. నడిపిస్తుండడమేనని.. నేతలపై ఆధారపడకుండా చూసుకోవడమేనని అంటున్నారు పరిశీలకులు. మరి.. ఇప్పటికైనా.. టీడీపీ ఈ అలక, బ్లాక్మెయిల్ రాజకీయాలపై పంథాను మార్చుకుంటే మేలని అంటున్నారు పరిశీలకులు.