ఏపీలో శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల గెలుపు, ఓటములపై సర్వేలు కూడా జోరందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికలలో అధికారాన్ని వైసిపి నిలబెట్టుకుంటుందా లేక జనసేన-టీడీపీ కూటమి అధికారాన్ని చేపడుతుందా అన్న విషయంపై పలు సంస్థలు సర్వేలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే ‘వన్ భారత్’ సంస్థ నిర్వహించిన సర్వేలో వైసీపీకి షాక్ తగిలింది. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి 35 కు మించి సీట్లు రావని ఆ సంస్థ సర్వేలో వెల్లడైంది.
ఇక, టీడీపీ-జనసేన కూటమి 126 స్థానాలలో విజయం సాధిస్తుందని ఆ సర్వేలో వెల్లడైంది, మరో 14 స్థానాల కోసం వైసీపీ, టీడీపీ-జనసేనల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉందని తెలిపింది. కడప జిల్లాలో ఒక స్థానం మినహా మిగతా స్థానాలు వైసీపీకి దక్కనుండగా, చిత్తూరు, కర్నూల్, అనంతపూర్, వైసీపీకి కొన్ని సీట్లు దక్కనున్నాయి. అవి తప్ప ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రలోని మిగతా నియోజకవర్గాలలో మెజారిటీ స్థానాలు టీడీపీ-జనసేన కూటమి గెలుచుకోనుంది.