• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బే ఏరియా లో ‘తెలుగుదేశం-జనసేన-బిజెపి’ ఎన్నారైల సమావేశం! 

admin by admin
March 19, 2024
in Around The World, NRI, Trending
0
0
SHARES
1.3k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా లో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన అత్యంత ప్రభావశీలులు అయినటువంటి ఎన్నారైలు ఆదివారం సాయంత్రం మే 13 న జరగబోయే ఎన్నికల సంబంధించిన  సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో వందమందికి పైగా ప్రముఖులు పాల్గొని కీలక చర్చలు జరిపారు.

రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకుని రావలసిన ఆవశ్యకత గురించి చర్చించారు.

గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అరాచక పాలన మీద పలువురు ఎన్నారైలుఆందోళన వ్యక్తం చేసారు.

2014 లో మాదిరి కూటమి‌ బంపర్ మెజారిటీ సాధించడం ఖాయం అంటూ కొంతమంది ఎన్నారైలు తమ అభిప్రాయాలు తెలిపారు.

కొంత మంది ప్రముఖులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో సామాన్య ప్రజల సెన్సిటివ్ డేటాను వాలంటీర్ల ద్వారా సేకరించి ఆ డేటా ని తప్పుదారి పట్టించేలా చెస్తున్నారు అని, ఎదురుతిరిగి మాట్లాడితే నియంతాలా మారి అధికారం బలంతో వేధిస్తున్నారు అన్నారు.

ఇటువంటి పాలనని ఇంటికి పంపించకపోతే మనం సొంత రాష్ట్రం కి  కూడా వెళ్లలేని పరిస్తితులు తీసుకొస్తాడు ఈ నియంత జగన్ అంటూ మండిపడ్డారు.

ఇప్పటికే రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయింది అని, ఇంకోసారి ఈ ప్రభుత్వం వస్తే మనం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ని మర్చిపోవచ్చు అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.

ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి మనం అందరం ఇంకా బలంగా పని చేయాల్సిన సమయం ఆసన్నమైంది అని, మన వంతు ఆర్థిక సహాయాన్ని జనసేన తెలుగుదేశం కూటమికి అందించడంతోపాటు గ్రౌండ్ లో కూటమి అభ్యర్థులకి ప్రచారం చేయాలి అని, దానికి కావలసిన ఆర్థికమైన నిధులు మనమే సమకూర్చుకుందాం అని తీర్మానించుకున్నట్టు పలువురు ఎన్నారైలు తెలియజేసారు.

ఈ సమావేశంలో తణుకు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ, నందిగామ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య మరియు జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ జూమ్ కాల్  లో పాల్గొని తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు.

జనసేన నాయకులు బొలిశెట్టి సత్య మాట్లాడుతూ, జన సైనికులు నిరాశకి ఎక్కడ తావివ్వకుండా పొత్తు ధర్మం పాటించి 175 నియోజకవర్గాల్లో‌ బయటకి వచ్చి తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి పనిచేసి అఖండ మెజారిటీ దిశగా పని చేయాలని పిలుపు ఇవ్వగా ఒక్కసారిగా ఆడిటోరియం కరతాళధ్వనులతో మారుమ్రోగింది.

ఈ సమావేశంలో తెలుగుదేశం కి చెందిన ఎన్నారై సభ్యులు జయరాం కోమటి, వెంకట్ కోగంటి, భక్త బల్ల, శ్రీనివాస్ దేవల్ల, ఎంవి రావు, నరహరి మర్నేని, హరి బాబు బొప్పుడి, సందీప్ ఇంటూరి, సత్య పోలవరపు, జనసేన కి చెందిన వేణు అనుగంటి, తులసీరాం రావూరి, రామ్ చుండూరి, శ్రీనివాస్ చిమట, రెడ్డయ్య ప్రత్తిపాటి, అనిల్ అరిగే, సునీల్ పసుపులేటి, దుర్గ పెద్దిరెడ్డి, శంకర్ అడాబా, చంద్ర పట్టివాడు, సత్య పుట్ట, నారాయణ మట్టిగంట, రమేష్ రాగినేని, కిషోర్ కుమార్, నిరంజన్, రమణ అనుగంటి మరియు తెలుగుదేశం-జనసేన- బిజెపి పార్టీల అభిమానులు పాల్గొన్నారు.

 

Tags: bjp meetings in bay areatdp janasena
Previous Post

‘ట్రస్ట్ పాలిటిక్స్’-CBN-Jagan-KCR!

Next Post

జగన్ `చెత్త‌ రికార్డు`..మరే ఏపీ సీఎంకు లేదు

Related Posts

Andhra

జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్

June 18, 2025
Andhra

చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు

June 18, 2025
Around The World

వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు

June 18, 2025
Andhra

లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత

June 17, 2025
India

పాముతో ఆట‌లు.. ముద్దు పెట్టబోయి ప్రాణాల‌నే రిస్క్‌లో పెట్టుకున్న రైతు!(వీడియో)

June 17, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Load More
Next Post
andhra pradesh CM jagan

జగన్ `చెత్త‌ రికార్డు`..మరే ఏపీ సీఎంకు లేదు

Latest News

  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
  • జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు
  • ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!
  • జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!
  • లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత
  • ఇకనైనా కొమ్మినేని మారతారా?
  • చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?
  • పవన్ కోసం సరికొత్త విలన్
  • ‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్
  • జ‌న‌సేన ముచ్చ‌ట‌.. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదా ..!
  • చంద్రబాబుకు ఒవైసీ ఉచిత స‌ల‌హా
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra