అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా లో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన అత్యంత ప్రభావశీలులు అయినటువంటి ఎన్నారైలు ఆదివారం సాయంత్రం మే 13 న జరగబోయే ఎన్నికల సంబంధించిన సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో వందమందికి పైగా ప్రముఖులు పాల్గొని కీలక చర్చలు జరిపారు.
రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకుని రావలసిన ఆవశ్యకత గురించి చర్చించారు.
గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అరాచక పాలన మీద పలువురు ఎన్నారైలుఆందోళన వ్యక్తం చేసారు.
2014 లో మాదిరి కూటమి బంపర్ మెజారిటీ సాధించడం ఖాయం అంటూ కొంతమంది ఎన్నారైలు తమ అభిప్రాయాలు తెలిపారు.
కొంత మంది ప్రముఖులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో సామాన్య ప్రజల సెన్సిటివ్ డేటాను వాలంటీర్ల ద్వారా సేకరించి ఆ డేటా ని తప్పుదారి పట్టించేలా చెస్తున్నారు అని, ఎదురుతిరిగి మాట్లాడితే నియంతాలా మారి అధికారం బలంతో వేధిస్తున్నారు అన్నారు.
ఇటువంటి పాలనని ఇంటికి పంపించకపోతే మనం సొంత రాష్ట్రం కి కూడా వెళ్లలేని పరిస్తితులు తీసుకొస్తాడు ఈ నియంత జగన్ అంటూ మండిపడ్డారు.
ఇప్పటికే రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయింది అని, ఇంకోసారి ఈ ప్రభుత్వం వస్తే మనం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ని మర్చిపోవచ్చు అంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.
ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి మనం అందరం ఇంకా బలంగా పని చేయాల్సిన సమయం ఆసన్నమైంది అని, మన వంతు ఆర్థిక సహాయాన్ని జనసేన తెలుగుదేశం కూటమికి అందించడంతోపాటు గ్రౌండ్ లో కూటమి అభ్యర్థులకి ప్రచారం చేయాలి అని, దానికి కావలసిన ఆర్థికమైన నిధులు మనమే సమకూర్చుకుందాం అని తీర్మానించుకున్నట్టు పలువురు ఎన్నారైలు తెలియజేసారు.
ఈ సమావేశంలో తణుకు తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ, నందిగామ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య మరియు జనసేన నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ జూమ్ కాల్ లో పాల్గొని తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు.
జనసేన నాయకులు బొలిశెట్టి సత్య మాట్లాడుతూ, జన సైనికులు నిరాశకి ఎక్కడ తావివ్వకుండా పొత్తు ధర్మం పాటించి 175 నియోజకవర్గాల్లో బయటకి వచ్చి తెలుగుదేశం కార్యకర్తలతో కలిసి పనిచేసి అఖండ మెజారిటీ దిశగా పని చేయాలని పిలుపు ఇవ్వగా ఒక్కసారిగా ఆడిటోరియం కరతాళధ్వనులతో మారుమ్రోగింది.
ఈ సమావేశంలో తెలుగుదేశం కి చెందిన ఎన్నారై సభ్యులు జయరాం కోమటి, వెంకట్ కోగంటి, భక్త బల్ల, శ్రీనివాస్ దేవల్ల, ఎంవి రావు, నరహరి మర్నేని, హరి బాబు బొప్పుడి, సందీప్ ఇంటూరి, సత్య పోలవరపు, జనసేన కి చెందిన వేణు అనుగంటి, తులసీరాం రావూరి, రామ్ చుండూరి, శ్రీనివాస్ చిమట, రెడ్డయ్య ప్రత్తిపాటి, అనిల్ అరిగే, సునీల్ పసుపులేటి, దుర్గ పెద్దిరెడ్డి, శంకర్ అడాబా, చంద్ర పట్టివాడు, సత్య పుట్ట, నారాయణ మట్టిగంట, రమేష్ రాగినేని, కిషోర్ కుమార్, నిరంజన్, రమణ అనుగంటి మరియు తెలుగుదేశం-జనసేన- బిజెపి పార్టీల అభిమానులు పాల్గొన్నారు.