పుంజుకున్న టీడీపీ గ్రాఫ్‌.. సోష‌ల్ మీడియా చ‌ర్చ

టీడీపీ గ్రాఫ్ పుంజుకుందా?  పార్టీకి గ‌డిచిన ఏడాదిన్న‌ర కాలంలో లేని విధంగా ఫాలోయింగ్ పెరిగిందా? అం టే.. ఔన‌నే అంటున్నారు సోష‌ల్ మీడియా జ‌నాలు. గ‌త 2019 ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీ భారీ ఎత్తున ప‌త‌నాన్ని చ‌వి చూసింది. నాయ‌కులు పార్టీపై న‌మ్మ‌కం కోల్పోయిన ప‌రిస్థితి కూడా క‌నిపించింది. ఒకానొక ద‌శ‌లో ఇక‌, టీడీపీ ఉంటుందా?  ఉండ‌దా? అనే సందేహాలు కూడా తెర‌మీదికి వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే పార్టీ నుంచి గెలిచిన వారు, ఓడిన వారు కూడా జంప్ చేశారు. మ‌రికొంద‌రు అన్నీ సిద్ధం చేసుకుని చివ‌రి నిముషంలో వాయిదా వేసుకున్నారు. అయితే.. ఇప్పుడు మారిన రాజ‌కీయ ప‌రిస్థితులు.. టీడీపీలో నూత‌నోత్తేజం క‌ల్పిస్తున్నాయి.

మ‌రీ ముఖ్యంగా క‌రోనా స‌మ‌యంలో టీడీపీ అధినేత ఇంటికే ప‌రిమిత‌మైనా.. ఆయ‌న జూమ్ యాప్ ద్వారా క‌రోనాపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణుల‌తో అనేక చ‌ర్చ‌లు చేసి.. ప్ర‌జ‌ల‌కు సందేశం ఇప్పించారు. ఇది బాగా వ‌ర్క‌వుట్ అయింది. ఇక‌, నివ‌ర్ తుఫాను కార‌ణంగా న‌ష్ట‌పోయిన రైతాంగానికి భ‌రోసా క‌ల్పించే కార్య‌క్ర‌మంలో భాగంగా .. పార్టీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి లోకేష్ క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌లు మ‌రింత‌గా పార్టీకి బూస్ట్ ఇచ్చాయి. పార్టీలో ప‌ద‌వులు క్రియేట్ చేసి.. అంద‌రికీ అవ‌కాశం ఇవ్వ‌డం ద్వారా అప్ప‌టి వ‌ర‌కు ఉన్న నైరాశ్యాన్ని తొల‌గించే ప్ర‌య‌త్నం చేయ‌డం కూడా ఫ‌లించింది.

ఇక‌, ఇప్పుడు వ‌రుస‌గా జ‌రుగుతున్న దేవాల‌యాల‌పై దాడుల విష‌యంలో టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. నేరుగా చంద్ర‌బాబు రంగంలోకిదిగిన విధానం వంటివి మెజారిటీగా ఉన్న హిందూ ప్ర‌జ‌ల‌కు ద‌న్నుగా నిలుస్తున్నాయి. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం, ప్ర‌జ‌ల త‌ర‌ఫున గ‌ట్టివాయిస్ వినిపించేందుకు మేమున్నాంటూ.. చంద్ర‌బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌పై ప్ర‌జ‌ల్లో మంచి విశ్వాసాన్ని ప్రోదిచేస్తున్నాయి. ఇదే.. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల రామ‌తీర్థంలో చంద్ర‌బాబు ప‌ర్య‌టించ‌డంపై సోష‌ల్ మీడియాలో సానుకూల కామెంట్లు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో ఆయ‌న‌పై కేసులు న‌మోదు చేయ‌డాన్ని ప్ర‌తి ఒక్క‌రూ ఖండించారు. ఇలా.. ఒక‌వైపు ప్ర‌జా స‌మ‌స్య‌లు, మ‌రో వైపు పార్టీఆలో సంస్క‌ర‌ణ‌ల‌తో టీడీపీ దూకుడుగా ఉండ‌డంతో పార్టీ గ్రాఫ్ పుంజుకుంద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

ReplyForward

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.