ఈరోజు ఏపీలో ఒక విచిత్ర చోటు చేసుకుంది. సాధారణంగా అధికార పార్టీకి పోలీసులు కాస్త అనుకూలంగా వ్యవహరించడం ఎక్కడైనా ఉండేదే. కానీ ఏపీలో అసలు ప్రతిపక్షాలు కంప్లయింట్ ఇచ్చినా తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇది అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
నిజానికి పోలీసులకు ఆ హక్కు లేదు. కోర్టు కెళ్లి ఆదేశాలు తెచ్చుకుని కంప్లయింట్ ఇచ్చే అవకాశం ఉంది ప్రతిపక్షానికి. కానీ అంత అవసరమా? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుని అమరావతి రైతులను ఉద్దేశించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అమర్యాదగా, అసభ్యపదజాలంతో అవమానించిన విషయం తెలిసిందే.
డిప్యూటీ సీఎం పచ్చిబూతులు మీడియా ముఖంగా మాట్లాడటం ఎక్కడా చెల్లదు. దీంతో ఆయనపై ఫిర్యాదు చెయ్యడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఫిర్యాదు ఇవ్వడానికి నరసన్నపేట పీయెస్ కి వెళ్లిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావ్ ని… ఎంపీ రామ్మోహన్ నాయుడుని, ఎమ్మెల్యే అశోక్ ని పోలీసులు కనీసం స్టేషన్లోకి అనుమతించలేదు.
ఎవరి ఆదేశాలతో పోలీసులు ఇలా చేస్తున్నారు? వాళ్ళు బూతులు తిడుతుంటే మేము భరించాలా? న్యాయంగా చర్య తీసుకొండనే హక్కు లేదా?లేక ప్రభుత్వ పెద్దలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారా? ఇదెక్కడి సాంప్రదాయం? పోలీసుల విపరీతవైఖరి ఏంటి అని తెలుగుదేశం వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.