త్వరలోనే ఎన్డీఏలోకి టీడీపీ చేరనుందా? ఢిల్లీ వర్గాల సమాచారం చూస్తే అలానే ఉన్నాయి పరిస్థితులు. వచ్చే దసరా, దీపావళి టీడీపీ ఎన్డీఏ గూటికి చేరుతుందని తెలుస్తోంది.
ఈ మేరకు ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో ఒక ఆసక్తికర కథనం వెలువండింది. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ లతో చర్చలు జరిగినట్లు అందులో పేర్కొన్నారు.
ఇప్పటికే టీడీపీ, బీజేపీ మధ్య పొత్తుకు సంబంధించి.. చర్చలు కూడా జరిగాయంటూ ఆ కథనంలో పేర్కొన్నారు.
ఇటీవల మోదీని చంద్రబాబు కలిసిన సమయంలోనే అమిత్‍షాను లోకేశ్ కలిశారని ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఏపీలో జగన్ హవా పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో భవిష్యత్తులో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న టీడీపీని దగ్గర చేర్చుకుంటేనే మంచిదన్న ఆలోచనతో బీజేపీ ఇలా చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇటీవల హైదరాబాద్‍లో రామోజీరావు, జూనియర్ ఎన్టీఆర్‍తో భేటీ అయిన అమిత్‍షా – బాబు, మోదీ షేక్‍హ్యాండ్‍పై ఇప్పటికే వైసీపీలో కలవరపాటు కలిగిన విషయం తెలిసిందే. 5 నిమిషాల మోడీ మీటింగ్ తోనే పెద్ద ప్రెస్ మీట్ పెట్టారు సజ్జల రెడ్డి. ఈ నేపథ్యంలో తాజా వార్త వారిని ఇంకెంత కలవరానికి గురిచేస్తుందో మరి.
పైగా ఇటీవల చంద్రబాబు సెక్యూరిటీని కేంద్రం పెంచడం కూడా ఈ కథనానికి బలం చేకూరుస్తోంది.