తెలంగాణ విమోచన దినోత్సవాన్ని.. ఒక్క తెలంగాణలోనే కాకుండా.. దేశవిదాశాల్లోనూ.. తెలంగాణకు చెందిన వ్యక్తులు, సంస్థలు ఘనంగా నిర్వహించాయి.
గత రెండు దశాబ్దాలుగా అమెరికాలో తెలంగాణ, తెలుగు సంస్కృతిని పరిరక్షిస్తూ.. ప్రోత్సహిస్తున్న తెలంగాణ కల్చరల్ అసోసియేషన్(TCA) సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది.
అదేవిధంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని కూడా ప్రారంభించింది. ఈ వేడుకలు.. ఉల్లాస, ఉత్సాహ భరిత వాతావరణంలో నిర్వాహకులు చేపట్టారు.
ఈ వేడుకలతోపాటు అక్టోబర్ 1, 2 తేదీల్లో నిర్వహించనున్న బతుకమ్మ పండుగకు కూడా సన్నాహాలు పూర్తిచేశారు.
ఈ కార్యక్రమాన్ని.. భారత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల నినాదంతో భారత యూనియన్‌తో తెలంగాణ ఏకీకరణకు గుర్తుగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
1948 సెప్టెంబర్ 17న, భారతదేశం బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్ర్యం పొందినప్పటికీ.. తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం ఏలుబడిలోనే కొనసాగింది.
అయితే.. అప్పటి కేంద్ర ప్రభుత్వం.. హైదరాబాద్ సంస్థానం నిజాం పాలన నుంచి భారత్ యూనియన్‌లో కలిసేలా ఆపరేషన్ పోలో కార్యక్రమాన్ని చేపట్టింది.
తద్వారా.. తెలంగాణ ప్రజలకు నిజాం పాలన నుంచి విముక్తి కలిగింది.
తెలంగాణ ప్రజలకు.. తెలంగాణ చరిత్రలో కొన్ని తేదీలు అసాధారణమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయని TCA భావిస్తోంది.
అలాంటివాటిలో సెప్టెంబర్ 17 కీలకని పేర్కొంది. తెలంగాణా విమోచన దినం, నిజాం అమానవీయ పాలన నుండి తెలంగాణ విముక్తి పొందింది.
రజాకార్లు నిజాం భారత దళాలకు లొంగిపోయారు.
ఈ తెలంగాణ విమోచన దినోత్సవం రోజున నిజాం నుంచి తెలంగాణకు విముక్తి కల్పించారు.
ఈ నేపథ్యంలోనే విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు.
బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా రామ్‌జీ గోండ్ చేసిన పోరాటంతో సహా మొత్తం స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాటాల దృష్టాంతాలు చరిత్రలో కనిపిస్తాయి.
కొమరం భీమ్ పోరాటం; 1857లో హైదరాబాద్ నగరంలోని కోటిలో బ్రిటీష్ రెసిడెంట్ కమీషనర్ నివాసంపై భారత జాతీయ జెండాను ఎగురవేయాలనుకున్న తుర్రేబాజ్ ఖాన్ యొక్క శౌర్యం.. వంటివి.. చరిత్రను తిరగరాశాయి.
భారత స్వాతంత్ర్యం తర్వాత ఈ పోరాటం ఉధృతంగా మారింది.
వందేమాతరాన్ని ఆలపిస్తూ.. వేలాది మంది ప్రజలు.. ఈ ఉద్యమంలో భాగస్వామ్యమయ్యారు.
సంస్థాన్‌ను భారత యూనియన్‌లో విలీనం చేయాలనే డిమాండ్‌తో పోరాటం సాగించారు.
ఒక భారీ ప్రజా ఉద్యమంగా రూపాంతరం చెంది.. చిట్టచివరకు నిజాం పాలన అంతమయ్యేలా చేసింది.
ఆపరేషన్ పోలో కింద భారతదేశ మొదటి హోం వ్యవహారాల మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన చర్యల కారణంగా హైదరాబాద్ విముక్తి సాధ్యమైంది.
తెలంగాణ విమోచన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశానికి TCA ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, TCA అడ్వైజరీ కమిటీ TCA కోర్ టీమ్‌తో కూడిన బృందం హాజరైంది.
నిజాం దురాగతాలకు వ్యతిరేకంగా తెలంగాణ నుంచి తిరుగుబాటు చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు ఈ బృందం నివాళులు అర్పించింది.
ఈసందర్భంగా సంవత్సరం పాటు జరిగే కార్యక్రమంలో భాగంగా ప్రముఖ కళాకారుడు బాతిక్ బాలయ్య యాసల సుందరంగా చిత్రించిన చిత్రాలను ఈ కార్యక్రమంలో ఛైర్మన్ బోడ ధనంజయరెడ్డి, అధ్యక్షులు శ్రీనివాసరావు గుజ్జు ఆవిష్కరించారు.
సమావేశంలో ప్రస్తుత చైర్మన్ బోడ ధనంజయరెడ్డి, అధ్యక్షుడు శ్రీనివాసరావు గుజ్జు, ఉపాధ్యక్షుడు మహిపాల్ అన్నం, ప్రధాన కార్యదర్శి వినోయ్ మేరెడ్డి, కోశాధికారి సాగర్ కోత, సాంస్కృతిక కార్యదర్శి గోపికృష్ణ గౌరిశెట్టి సహా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
సలహా మండలి సభ్యులు: విజయ్ చవ్వా, భాస్కర్ మద్ది, చంద్రకళ సిరామదాస్, ప్రసాద్ గట్టు, రాజు యాసాల మరియు సంస్థలో భాగమైన ఇతర ప్రధాన సభ్యులు: బాలేశ్వర్, సదానందం కనికరం, భాస్కర్ బండికల్లు, రాజు యాసాల, ఉదయ్ జొన్నల, జ్యోతి మరియు అశోక్ చిగుళ్లపల్లి, శ్రవణ్ సిరామదాస్ తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మ వేడుకలు..
తెలంగాణ సంప్రదాయంలో కీలకమైన బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు.. ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. అక్టోబరు 1 మధ్యాహ్నం 12.30 నుండి 6.30 వరకు శాన్ రామన్ విండ్మెర్ రాంచ్ స్కూల్లో నిర్వహిస్తారు.
అదేవిధంగా అక్టోబరు 2, ఆదివారం 12.30 నుండి 6.30 వరకు సన్నీ వేల్లోని ఒర్టెగా పార్క్ (AKA బతుక్కం పార్క్)లో జరగబోయే బతుకమ్మ పండుగ వేడుకలను బృందం అంకురార్పణ చేసింది.
ఈ రెండు కార్యక్రమాలకు కౌన్సిల్ జనరల్ ఎస్ ఎఫ్ ఓ టీవీ నాగేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
TCA ఈ సంవత్సరం లాత్రోప్లో రివర్ ఐలాండ్ ఇండియన్ కమ్యూనిటీ సహకారంతో బతుకమ్మ పండుగను 2వ తేదీన మోస్డేల్ కమ్యూనిటీ పార్క్‌లో 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు నిర్వహిస్తోంది.