• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అమెరికాలో తెలుగు తేజం ‘ర‌త్త‌య్య జాస్తి’ క‌న్నుమూత‌!

సంతాపం ప్ర‌క‌టించిన జ‌య‌రాం కోమ‌టి!!

admin by admin
September 22, 2022
in NRI
0
0
SHARES
1.7k
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సేవా దురంధ‌రులు ర‌త్త‌య్య జాస్తి ఇక‌లేరు!
రెండు రోజులుగా ఆరోగ్య స‌మ‌స్య‌లు
మ‌న వాళ్లంటే ప్రాణం పెట్టే తెలుగు తేజం
1954లోనే ఓడ‌లో అమెరికాకు ప‌యనం
ఉన్న‌త విద్య‌, స‌మున్న‌త ఉద్యోగం
అయినా, తెలుగు నేల‌ను మ‌ర‌వ‌ని నైజం
నివాళుల‌ర్పించిన బే ఏరియా నాయ‌కులు

అగ్ర‌రాజ్యం అమెరికాకు 68 ఏళ్ల క్రితం ఓడ‌ల్లో ప‌య‌నించి వెళ్లి మన తెలుగు ఉన్న‌తిని స‌మున్న‌త స్థాయికి చేర్చిన తెలుగు తేజం ‘ర‌త్త‌య్య జాస్తి’ ఇక‌లేరు.
94 ఏళ్ల వ‌య‌సులో ఆయ‌న న్యుమోనియా స‌మ‌స్య‌తో అమెరికాలోని ఓ ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కాలం అగ్ర‌రాజ్యంతో ఆయ‌న అనుబంధం ఏర్ప‌రుచుకున్నారు. తెలుగు వారు ఎక్క‌డ ఉన్నా క‌లిసి మెలిసి ఉండాల‌ని స్వప్నించిన‌ ర‌త‌య్య జాస్తి స‌తీమ‌ణి 20 ఏళ్ల కింద‌టే క‌న్నుమూశారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఒంట‌రిగానే ఉంటున్నారు. రెండు రోజుల కింద‌ట అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన‌ ఆయ‌న ప‌రిస్థితి విష‌మించి ప‌ర‌మ‌ప‌దించిన‌ట్టు కాలిఫోర్నియాలోని బే ఏరియా తెలుగు సంఘాల నాయ‌కులు తెలిపారు.

బోడ‌పాడు నుంచి బే ఏరియా కు!!
ర‌త్త‌య్య జాస్తి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో ఉన్న బోడ‌పాడు గ్రామానికి చెందిన వారు. 1928లో జ‌న్మించిన ఆయ‌న అప్ప‌ట్లోనే ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించారు. మ‌ద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌టెక్నాల‌జీలో ఇంజ‌నీరింగ్ చేసిన ఆయ‌న‌ బెంగ‌ళూరులోని ఐఐఎస్ సీలో మాస్ట‌ర్స్ డిగ్రీ పూర్తి చేశారు.అనంతరం పిహెచ్‌డీ కోసం, అగ్ర‌రాజ్యం బాట‌ప‌ట్టారు. మిన్నెసోటా యూనివ‌ర్సిటీలో మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. అనంత‌రం కాలిఫోర్నియాలోని `లాక్‌హీడ్ మార్టిన్‌`లో ఇంజ‌నీరుగా ఉన్న‌త‌స్థాయిలో సుదీర్ఘ కాలం పాటు సేవ‌లు అందించారు. అయితే ఇక్క‌డ ఆస‌క్తికర విష‌యం ఏంటంటే 1954లో ఆయ‌న అమెరికాకు ఓడ‌లో ప్ర‌యాణించి వెళ్లారు.అలా ఓడ‌లో ప్ర‌యాణించిన వెళ్లిన తొలి త‌రం తెలుగు వారు కూడా ఆయ‌నే. సుమారు 38 రోజుల పాటు ఇలా ప్ర‌యాణించాల్సి వ‌చ్చేది.

తెలుగంటే ప్రాణం!!
తెలుగు వారంతా ఐక్యంగా ఉండాల‌ని ర‌త్త‌య్య జాస్తి త‌పించారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రం ఉమ్మ‌డిగా ఉండాల‌ని, తెలుగు వారు క‌లిసి ఉండాల‌ని భావించారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆ పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు ఎన్టీఆర్‌తోనూ అవినాభావ సంబంధాలు ఏర్పాటు చేసుకుని తెలుగు జాతి ఐక్య‌త‌కోసం ఆయ‌న స్వ‌ప్నించారు.
ఇటీవ‌ల భార‌త సుప్రీం కోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా రిటైరైన‌ జ‌స్టిస్ ఎన్వీరమ‌ణ‌ విధుల్లో ఉన్న‌ప్పుడు అమెరికాలో ప‌ర్య‌టించారు.ఆ స‌మ‌యంలో వ‌యోవృద్ధులు అయిన‌ప్ప‌టికీ కూడా ఓపిక చేసుకుని మ‌రీ వ‌చ్చి జ‌స్టిస్ ఎన్ వీ ర‌మ‌ణ‌ను ప‌ల‌కించారు. టెక్సాస్ లోని  సాన్ ఆంటోనియో కి 91 ఏళ్ల వయస్సులో  ప్రయాణించి, తన గ్రామానికి చెందిన నూతన దంపతులని ఆశీర్వదించారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు ర‌త్త‌య్య జాస్తికి తెలుగు వారిప‌ట్ల, వారి గ్రామ ప్రజల ఉన్న పట్ల ఉన్న  ఆత్మీయ‌త‌ను ప్ర‌స్ఫుటీక‌రించేలా చేస్తాయ‌న‌డంలో సందేహం లేదు.

గుప్త దానాలు!!
వైద్య రంగానికి ఆయ‌న ఇతోధికంగా అనేక సాయాలు అందించారు. మూడో కంటికి తెలియ‌కుండా అనేక గుప్త‌దానాలు చేశారు.అప్ప‌ట్లోనే ఎల్వీ ప్ర‌సాద్ కంటి ఆసుప‌త్రికి దాదాపు కోటి రూపాయ‌ల వ‌ర‌కు ఆర్థిక సాయం అందించారు. అంతేకాకుండా ఒక బ్లాక్‌ను సైతం నిర్మించి రోగుల‌కు సాయ‌ప‌డాల‌నే అత్యున్న ఆశ‌యాన్ని నెర‌వేర్చుకున్నారు.

అమెరికా కోల్పోయింది!!
బే ఏరియా క‌మ్యూనిటీ నాయ‌కుడు జ‌య‌రాం కోమ‌టి ర‌త్త‌య్య జాస్తి మృతి ప‌ట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. 40 ఏళ్లుగా ఆయ‌న‌తో త‌న‌కు సుదీర్ఘ అనుబంధం ఉంద‌ని పేర్కొన్నారు. ర‌త్త‌య్య జాస్తి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆ భగవంతుడిని కోరుకుంటున్న‌ట్టు తెలిపారు.

ర‌త్త‌య్య జాస్తి కి అత్యంత ఆప్తులు ప్రొఫెసర్ ఆంజనేయులు కొత్తపల్లి, డాక్టర్ హనిమిరెడ్డి లక్కిరెడ్డి కుటుంబం, డాక్టర్ పేరయ్య సుందనగుంట, భగత్ సింగ్ యలమంచిలి, జోషి అన్నే, భోగేశ్వర రావు దయనేని తదితరులు ఓ పెద్ద దిక్కుని కోల్పోయామని ఆవేదన వ్యక్తపరిచారు.

ర‌త్త‌య్య జాస్తి మ‌ర‌ణం ప‌ట్ల‌ కాలిఫోర్నియాలోని బే ఏరియా క‌మ్యూనిటీ నాయ‌కులు, స్థానిక తెలుగు సంఘాలు, బాటా మరియు తానా కార్య వర్గాలు ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు. అమెరికా ఆయ‌న‌ను కోల్పోయింద‌ని ప‌లువురు పేర్కొన్నారు.

Tags: rattayya JastiUSA
Previous Post

TCA ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం!

Next Post

తాత విషయంలో గోడ మీద పిల్లిలా తారక్…ట్రోలింగ్

Related Posts

NRI

‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం

March 23, 2023
NRI

NRI TDP USA-ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యంపై ‘జ‌య‌రాం కోమ‌టి’ హ‌ర్షం!

March 19, 2023
NRI

శాన్ జోస్ లో ఘ‌నంగా AIA హోలీ వేడుక‌లు!

March 14, 2023
NRI

WETA అధ్వర్యం లో డల్లాస్ లో అంతర్జాతీయ మహిళల దినోత్సవ వేడుకలు!!

March 14, 2023
NRI

NRI TDP-ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 8 మంది డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేసిన చంద్రబాబు నాయుడు

March 11, 2023
NRI

TANA-కొలంబస్ లో ఘనంగా ముగిసిన ‘తానా’ 23వ కన్వెన్షన్ కిక్‌ ఆఫ్’!

February 28, 2023
Load More
Next Post

తాత విషయంలో గోడ మీద పిల్లిలా తారక్...ట్రోలింగ్

Latest News

  • వైసీపీ ఎమ్మెల్యేల‌పై సస్పెన్ష‌న్‌.. మ‌రి వారు ఎలా రియాక్ట్ అయ్యారంటే!
  • పవన్ సినిమాకు ‘మెగా’ మార్కు డేట్ 
  • మనోజ్‌తో గొడవపై విష్ణు స్పందన
  • ‘సౌండ్ పెంచమని చెప్పు’ అనేందుకు అలా చేసుడేంది కేసీఆర్?
  • రచ్చకెక్కుతున్న ‘మంచు’ గొడవ
  • స్పీకర్ తమ్మినేని గుట్టు విప్పిన టీడీపీ నేత
  • చంద్రబాబు లెక్కసరిచేశారా?
  • నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే
  • ఎమ్మెల్యేలను పూచికపుల్లలా తీసేస్తే ఇలాగే ఉంటుంది జగన్ మావా !
  • టీఎస్ పీఎస్సీ బోర్డే వివాదాస్పదమా ? 
  • టీడీపీ నాశ‌నం కోరుకుని.. తానే నాశ‌నం అవుతున్న వైసీపీ!?
  • స‌జ్జ‌ల వీటికి స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా?
  • వైసీపీలో వారిపై  అనుమానం చూపులు
  • ‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం
  • నిజ‌మేనా… మోహ‌న్‌బాబు మాట నొమ్మొచ్చా…!

Most Read

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra