• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఫిలడెల్ఫియాలో ఘనంగా ‘తానా’ వన భోజనాలు!

admin by admin
September 28, 2022
in NRI
0
0
SHARES
133
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఉత్తర అమెరికాలో ప్రవాస తెలుగువారికి అలనాటి నుండి ఆసరాగా నిలిచినా లాభాపేక్షలేని సంస్థలలో తానా ప్రధానమైనది. తానా నిర్వహించే కార్యక్రమాల గురించి తెలుగువారికి ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు. అందరూ బాగుండాలి, అందులో తెలుగువారు ఉండాలి అనే సిద్ధాంతంతో అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, ఓక్స్ నగరంలోని లోయర్ పెర్కియోమెన్ వ్యాలీ పార్కులో సెప్టెంబర్ 25వ తేదీన మిడ్ అట్లాంటిక్ తానా టీం తెలుగువారు తానా వనభోజనాలు, ఆత్మీయ కలయిక మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. ఫిలడెల్ఫియా‌ నగర పరిధిలో నివాసముంటున్న సుమారు ఎనిమిది వందల మంది తెలుగువారు హాజరై ఈ వనభోజనాల కార్యక్రమాన్ని జయప్రదం చేసారు. పిల్లలు, పెద్దలలో ఉన్న సృజనాత్మకతను తట్టి లేపే పలు క్రీడలను నిర్వహించారు.

గడిచిన సంవత్సరాలలో ఫిలడెల్ఫియా టీం వనభోజనాల వంటి కార్యక్రమాలు ఎన్నో విజయవంతంగా నిర్వహించినా, ఈ సారి వచ్చిన విశేష స్పందనతో లోయర్ పెర్కియోమెన్ వ్యాలీ పార్క్ మొత్తం కిక్కిరిసిపోయింది. వరుణ దేవుడు తన ప్రతాపం చూపించినా, లెక్కచేయకుండా వనభోజనాలకు వచ్చిన అశేష తెలుగువారి కోలాహలంతో పార్కు పరిసరాలు సందడిగా మారాయి.. ఈ వనభోజనాల కార్యక్రమానికి పక్క రాష్ట్రాలైన న్యూ జెర్సీ, డెలావేర్ నుంచి కూడా తెలుగు ప్రజలు హాజరయ్యారు. టెక్సాస్ నుండి నాగరాజు నలజుల, వర్జీనియా నుండి బాబీ యెర్ర, ఫ్లోరిడా నుండి సాయి జరుగుల ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా విచ్చేసారు.

పసందైన విందులతో, ఆటపాటలతో సాగిన ఈ కార్యక్రమానికి కొంత సమయం వరుణుడు అంతరాయం కలిగించినా, అందరు ఉరకలిడే ఉత్యాహంతో ఎన్ఠీఆర్ గారి “వేటగాడు” చిత్రంలోని “ఆకు చాటు పింద తడిసే”, ఏన్ఆర్ గారి “ఆత్మా బలం” చిత్రంలోని “చిటపట చినుకులు పడుతూ ఉంటే” తదితర వాన పాటలకు ఎంతో జోష్ తో చిందులు వేశారు.

చివరగా వనభోజనాలు ముగింపు కార్యక్రమాన్ని పురస్కరించుకుని అక్కడకు విచ్చేసిన పలువురు తానా లీడర్స్ మిడ్ అట్లాంటిక్ ఫిలడెల్ఫియా టీంను, ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది అని ప్రశంసించారు. ప్రకృతి ఒడిలో ఆటలాడుతూ, సేద తీరుతూ, ఆదివారాన్ని ఆసాంతం ఆస్వాదించేలా చేసారు అని అక్కడకు హాజరైన పలు తెలుగువారు వారి అనుభూతిని నిర్వాహకులకు పంచుకున్నారు. డాలర్ డ్రీమ్స్ సాఫల్యం చేసుకునే ఈ గజిబిజి గందరగోళ పరుగులో, తాము మరచిపోతున్న తెలుగింటి సంప్రదాయాలను, గతానుభూతులను నెమరువేసుకున్నారు. ఇంతమంది తెలుగువారు ఒకచోట కూర్చుని బంతి భోజనాలు చేయడం, అటపాటలతో కేరింతలతో హోరేటించడం తమకు ఎంతో తృప్తినిచ్చిందంటూ ఫిలడెల్ఫియా తానా టీంవారు ఈ సందర్భంగా తెలియజేసారు. ఈ వనభోజనాల కార్యక్రమానికి వచ్చిన ఆహ్వానితులుకి మిడ్-అట్లాంటిక్ టీం సభ్యలు రుచికరమైన ఇంటి భోజనాలు వడ్డించారు.

అన్నదాతలు:
రవి పొట్లూరి, సునీల్ కోగంటి, రవి మందలపు, కిరణ్ కొత్తపల్లి, సతీష్ తుమ్మల, హరి మోటుపల్లి, రఘు ఎద్దులపల్లి, హరనాథ్ దొడ్డపనేని, హరి మోటుపల్లి, సాంబయ్య కోటపాటి, ఫణి కంతేటి, రంజిత్ మామిడి, చలం పావులూరి, రామ ముద్దన, కోటిబాబు యాగంటి, మోహన్ మల్ల, వంశి నలజాల, అను తుమ్మల, రవి తేజ ముత్తు, లీల కృష్ణ దావులూరి, సుధాకర్ కంద్యాల, ఇందు సందడి, సరోజ యాగంటి, రాజేశ్వరి కోడలి, స్వరూప కోటపాటి, కవిత మందలపు, రూప ముద్దన, లక్ష్మి అద్దంకి, కవిత చిడిపోతు, లక్ష్మి అడ్డంకి, భవాని మామిడి, విజయశ్రీ పరుచూరి, మనీషా మేకా, నాయుడమ్మ యలవర్తి, భాస్కర్ దొప్పలపూడి తదితరులు.

ఈ సందర్భంగా తానా మిడ్ అట్లాంటిక్ కోఆర్డినేటర్ సునీల్ కోగంటి మాట్లాడుతూ తానా 23వ తానా మహాసభలు 2023 జులై 7 నుండి 9 వరకు ఫిలడెల్ఫియా లోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ లో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి, మహాసభల కోఆర్డినేటర్ పొట్లూరి రవి నేతృత్వంలో అంగరంగ వైభవంగా జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, ఏర్పాట్లలో భాగంగా నవంబర్ 5 నాడు పెన్సిల్వేనియా వార్మినిస్టర్ నగరంలోని ఫ్యూజ్ బాంక్వెట్ హాల్ లో తానా 23వ మహాసభల కిక్ ఆఫ్ డిన్నర్ ఏర్పాటు చేస్తున్నామని ఈ కార్యక్రమానికి తానా నాయకత్వం హాజరు అవుతున్నారని, తెలుగు ప్రజలంతా హాజరై సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

తానా లీడర్షిప్ టీం నుండి ఈ కార్యక్రమంలో సునీల్ కోగంటి, రాజా కసుకుర్తి, విద్య గారపాటి, శ్రీనివాస్ ఓరుగంటి, తానా 23వ మహాసభల కోఆర్డినేటర్ పొట్లూరి రవి, పాఠశాల చైర్ నాగరాజు నలజుల, టీం స్క్వేర్ కోచైర్ కిరణ్ కొత్తపల్లి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వనాధ్ కోగంటి, హరనాథ్ దొడ్డపనేని, లీలా కృష్ణ దావులూరి, శ్రీనివాస్ భారతవరపు, సుధాకర్ కంద్యాల, కృష్ణ నందమూరి, రాహుల్ యెర్ర, సాయి జరుగుల, రత్న మూల్పూరి, మూర్తి నూతనపాటి, రవి ఇంద్రకంటి, పవన్ నడింపల్లి, హరీష్ అన్నాబత్తిన, ప్రవీణ్ ఇరుకులపాటి, సురేష్ కంకణాల, శ్రీధర్ సాదినేని, శ్రవణ్ లంక, గౌరీ కర్రోతు, సతీష్ నల్లా, సౌజన్య ఉన్నవ తదితరులు సహాయ సహకారాలు అందించారు.

అలాగే స్పోర్ట్స్ & గేమ్స్ ను యూత్ వాలంటీర్ మన్విత యాగంటి మరియు తానా ఫిలడెల్ఫియా ఉమెన్స్ టీం కోఆర్డినేట్ చేసారు.

రుచికరమైన చిక్కని కాఫీ స్పాన్సర్ చేసినందుకు గాను భూమి కాఫీ ప్రొప్రైటర్ శ్రీ పాపారావు ఉండవల్లికి, తానా మిడ్ అట్లాంటిక్ కార్యక్రమాలకు సహకరిస్తున్న స్ప్రూస్ ఇన్ఫోటెక్ వేణు సంగానికి, ఫిలడెల్ఫియా తానా టీంవారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు.

Tags: PhiladelphiaTANA
Previous Post

ఎంపీ సంతోష్ కు కేసీఆర్ షాక్?

Next Post

దసరా నాడు కేసీఆర్ సంచలన నిర్ణయం

Related Posts

NRI

అంగరంగ వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం!

March 29, 2023
NRI

యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం!

March 29, 2023
NRI

‘తానా’ ఫౌండేషన్  కార్య‌ద‌ర్శి ‘వ‌ల్లేప‌ల్లి శ‌శికాంత్‌కు’ `విశిష్ట ఉగాది` పుర‌స్కారం

March 23, 2023
NRI

NRI TDP USA-ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యంపై ‘జ‌య‌రాం కోమ‌టి’ హ‌ర్షం!

March 19, 2023
NRI

శాన్ జోస్ లో ఘ‌నంగా AIA హోలీ వేడుక‌లు!

March 14, 2023
NRI

WETA అధ్వర్యం లో డల్లాస్ లో అంతర్జాతీయ మహిళల దినోత్సవ వేడుకలు!!

March 14, 2023
Load More
Next Post

దసరా నాడు కేసీఆర్ సంచలన నిర్ణయం

Latest News

  • అంగరంగ వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం!
  • యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం!
  • టీడీపీ, జనసేనలతో ఆ పార్టీ పొత్తు పక్కా అట!
  • అమరావతి విషయంలో జగన్ కు సుప్రీం షాక్
  • అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందా?
  • తమ్మినేనికి ఎసరు పెట్టిన కూన రవికుమార్
  • వైసీపీ రెండుగా చీలిందంటోన్న లోకేష్
  • లక్ష్మీ పార్వతి కి సజ్జలకు లింకేంటో చెప్పిన రఘురామ!
  • జగన్ కు పులివెందుల టెన్షన్
  • ఇక.. త‌ప్ప‌దు.. జ‌గ‌న్‌ మారాల్సిందే!!
  • రాపాక నీతులు చెప్ప‌డం ఏంటి బ్రో!!
  • వివేకా కేసు విచారణపై సుప్రీం సంచలన నిర్ణయం
  • జనసైనికుల ‘దమ్ము’పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు
  • సజ్జలకు జగన్ చెక్..ఇదే ప్రూఫ్?
  • ఆస్కార్ ఖర్చుపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కార్తికేయ

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra