నందిగామ పట్టణ ఆర్ఎస్ గార్డెన్స్ నందు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులు కేశినేని శివనాద్ (చిన్ని) సహకారంతో మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారి ఆధ్వర్యంలో 100 మంది మహిళలకు పట్టణ తెదేపా కౌన్సిలర్లు మరియు స్థానిక తెదేపా నేతలతో కలిసి *ఉచితంగా కుట్టుమిషన్లు* పంపిణీ చేసిన తంగిరాల సౌమ్య.
ఈ రోజు ఇంతటి మహత్కార కార్యక్రమానికి చేయూతనిచ్చిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారికి తానా ఫౌండేషన్ ట్రస్ట్ పుట్టగుంట సురేష్ కి, మన ప్రియతమ నాయకులు విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్ని కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
ఈ ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ ద్వారా మహిళమణుల ఆనందాలకు అవధులు లేవు.
చంద్రబాబునాయుడు గారు అధికారంలోకి వస్తేనే రాష్టాభివృద్ధి సాధ్యం.
గంజాయి స్మగ్లింగ్, మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాల్లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏపీని దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టారు.
వైసీపీ పాలనలో మహిళల మాన, ప్రాణాలకు రక్షణ కరువైంది.
ఏపీలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక రాష్ట్ర యువత పక్క రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారు.
వైసీపీ పాలనలో యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
మహాశక్తి పథకంలో భాగంగా రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
ఆడబిడ్డ నిధి’ నుం చి 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ నెలకు రూ.1500లు, ‘తల్లికి వంద నం’ పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతుంటే అంత మందికీ ఏడాదికి రూ.15 వేల రూపాయలు.
దీపం’ పేరుతో ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేయడం జరుగుతుంది.