‘తానా’ అంటే ఏ ఆసక్తీ లేదు, సభ్యత్వం కోసం ఒక డాలర్ కూడా ఖర్చు చేసే ఆలోచన అసలేలేదు, దాని నాయకత్వం గురించి చింత ఎప్పటికీ ఉండదు అయినా కూడా సపరివార సమేతంగా సభ్యత్వం చేరిక ఆఘ మేఘాలమీద రూపాయ ఖర్చు లేకుండా జరిగిపోతుంది. ఎలా? ఎలా?? ఎలా??? ఇది తెలియకపోతే మీరు అమెరికా తెలుగు జన జీవన స్రవంతి లో లేనట్లే.
గతంలోనే ‘నమస్తే ఆంధ్ర’ చెప్పినట్లు ‘తానా’ నాయకత్వం మూడు వర్గాలుగా చీలి మూడు ముక్కలాట ఆడుతూ మిగతా వర్గాల మీద పై చేయి కొరకు చేస్తున్న టక్కు టమార విద్యల్లో ముఖ్యమైన ‘తానా’ సభ్యత్వాల చేరిక జోరుగా సాగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కు రావాలంటే ఈ జనవరి చివరిలోగా $125/- చెల్లించి శాశ్వత సభ్యులుగా చేరాల్సి ఉంది. ‘తానా’ లో పైకి ప్రజాస్వామ్య ‘ఎలెక్షన్లు’ జరగాల్సి ఉండగా చాలా కాలం అధిపత్య ధోరణి చూపించే కొద్ధి మంది కనుసన్నల్లో ‘సెలెక్షన్లు’ తోనూ, గత పది ఏళ్లుగా వర్గాల సమీకరణలో ఓటు కవర్ల ‘కలెక్షన్లు’తోనో జరుగుతూ ఉండటం తెలిసిందే. ఇప్పటికే సుమారు 20 వేలమంది సభ్యులు (40 వేల ఓట్లు) ఉండగా వారిలో ఒకటి రెండు వేల తేడాతో మూడు వర్గాలకు చెందిన వారి ఓటర్లు (ఎన్నికల సమయంలో తమ వర్గాలకు సమర్పించుకొనేవారు) ఉండగా, వచ్చేఎ న్నికల్లో ఆధిపత్యం కోసం కొత్త సభ్యుల్ని చేర్చుకోవడం అనవాయతీగా వస్తోంది.
‘తానా’ వంటి స్వచ్ఛంద సంస్థల్లో సేవా దృక్పధం ఉన్నవారు గాని, సంస్థ మంచి పనులుకు ఆకర్షితులైనవారు గాని స్వంత సొమ్ము తో సభ్యులుగా చేరతారని భావిస్తే పప్పులో కాలు వేసినట్లే. ‘తానా’ స్థాపన తరువాత 30 ఏళ్లలో 5 వేలమంది మాత్రమే చేరితే, తరువాత కాలంలో ఎన్నికల అజండాతో ఒకసారి 3 వేలు, ఇంకోసారి 9 వేలు చేరగా ఇప్పటికి సుమారు 20 వేలు సభ్యత్వాలున్నాయి. ఎన్నికల్లో విజయావకాశాలు పెంచుకోవడానికి మూడు వర్గాలు కలసి మళ్ళి 10 వేలకు పైగా (50 శాతం పైగా పెంపు) కొత్త సభ్యుల్ని చేర్చడానికి వేసుకొంటున్న ప్రణాలికాలు ఇప్పటికే సగం పైగా పూర్తయ్యాయని తెలుస్తోంది అయితే ఈ కొత్త చేర్పింపులు అన్ని వర్గాలూ చేస్తుండడం వలన పరిస్థితి మళ్లీ గందరగోళంగా మొదటికే రావటమే గాక, ఎన్నికల్లో మరింత ఖర్చు ,సమయం, మనుషులు అవసరమై, విరక్తి కలిగించినా ఆశ్చర్యం లేదు. తెలుగు కమ్యూనిటీ కూడా సంస్థను, నాయకులను ఏహ్య భావంతో చూడడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదే విషయంలో గతంలో బోర్డు చైర్మన్ గా పని చేసిన మరియు ప్రస్తుతం ByLaws కమిటి చైర్మన్ గా కూడా ఉన్న ‘సతీష్ చిలుకూరి’ ప్రస్తుతం జరుగుతున్న చట్ట విరుద్ధ సభ్యత్వ ప్రక్రియపై తన ఆవేదనను ‘తానా’ లీడర్షిప్ కి ఇమెయిల్ పంపగా ఏ ఒక్కరూ పట్టించుకోక పోగా మరింతగా చేర్పింపులపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఇక ‘ప్రస్తుత మరియు తరువాతి అధ్యక్షుల’ వర్గాలతో కలసి ‘చేంజ్’ అంటూ ఎన్నికల కూటమి గా ఏర్పడి ‘ఇంక్లూసివ్ ‘ ప్యానెల్ అంటూ మిగిలిన ‘గత అధ్యక్షుల’ కూటమి తో తలపడి విజయం సాధించిన వెంటనే పేరుకు తగినట్లుగానే పూర్తిగా ‘చేంజ్’ అయి పోయి రెండు వర్గాలుగా విడివడి కొట్లాడుకుంటుండటం మనకి తెలిసిందే. అంతేకాక చాలా కాలం తాము చెప్పిందే వేదం, తాము చేసిందే పంచాయతీ అని భ్రమించిన ‘ఇంక్లూసివ్’ కూటమి ఓటమితో చోటా మోటా నాయకుల్లో చాల మందికి ఇక ఈ కూటమి/నాయకులూ దుర్భేద్యం ఏమీ కాదని తెలిసిపోయి ‘ఇంక్లూసివ్’ పేరుకు విరుద్ధంగా పక్క చూపులు లేదా బ్యాక్అప్ ఏర్పాట్లు చేసుకున్నారు. వెరసి ఈ మూడు వర్గాలు ‘తానా’ పై ఆధిపత్యం కొరకు రకరకాల వ్యూహాలతో ఆడుతున్న ‘మూడు ముక్కలాట’ గురించి గత ఆర్టికల్ లో వివరించాము. ప్రస్తుత పరిస్థితులలో ఎవరికీ నమ్మదగినంత మెజారిటీ లేదనే నిజాన్ని గుర్తెరిగి ఆటలో తమ బలాన్ని పెంచుకునే విధంగా, ప్రస్తుతం ఉన్న జనవరి నెల పరిధిలో కొత్త సభ్యుల్ని(ఓటర్లు?) తమదైన శైలి లో చేర్చుకుంటూ ఉన్నారు.
ముఖ్యంగా ఈ పనిలో దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ‘తరువాతి (మరియు తాజా గత) అధ్యక్షుల’ వర్గం తమ సంస్థాగత చేర్పుడు ముఠాను రంగంలోకి దించి సొమ్ములు దఫాల వారీగా చేరవేస్తూ పని కానిస్తుండగా పొటీ చేయాలని ఆశించే వారు పర్యవేక్షిస్తున్నారు. కోవిద్ ‘పీపీపీ’ సొమ్ములు దండిగా ఉన్న కార్పొరేట్ వర్గాల తోడ్పాటు బలంగా ఉన్నప్పటికీ, మిగతా వాళ్లతో పోటీ పడగలుగుతున్నారా అనేది ఫిబ్రవరి లోనే తెలుస్తుంది.
ఇక ఎన్నికల్లో ఓడిన ‘గత అధ్యక్షుల’ కూటమి అనుకోని ఓటమి తో వచ్చిన కసితో, ఈ సభ్యుల చేర్పింపు అనే కార్యక్రమం తామే ఏనాడో మొదలుపెట్టిన అనుభవసారంతో గత రెండు నెలలుగా ఇదే పనిమీద గుంభనగా వ్యూహం సిద్ధం చేసుకుని యాక్టీవ్ గా చేర్పింపులు చేసుకుంటూ పనిలో పనిగా 50% పైగా సభ్యత్వాలు తామే చేస్తున్నట్లు (గత ఎన్నికల్లో మెజారిటీ ఓట్లు తమ చేతుల్లోనే ఉన్నదన్నట్లుగా) రూమర్లు చెలామణిలో పెడుతూ ప్రెసిడెంట్ అండ్ ప్యానెల్ కాండిడేట్ పేర్లు కూడా గెలిచేసినట్లుగా మైండ్ గేమ్ ను తమ అనుయాయుల ద్వారా నడుపుతున్నారు. దీనితో కూటమి సభ్యులు చెదరకుండా ఉంటారని, మిగతా వర్గాలు కూడా ఎన్నికలకు భయపడి రాజీకి రావొచ్చని వ్యూహం కూడా ఉన్నప్పటికీ, అసలు విషయం ఫిబ్రవరి లోనే తెలుస్తుంది. కూటమిలో ముఖ్యమైన ముగ్గురిలో ఒకరు కనుమరుగైనట్లు పైకి అనిపిస్తూ, ఇంకొకరు అందరినీ రోజువారీ సమన్వయ పరుస్తూండగా, మూడవ వారు తెరవెనుక కధ యధావిధిగా నడుపుతున్నప్పటికీ, తిరిగి గత వైభవం తేగలుగుతారా అనేది త్వరలోనే అంచనాకు రావొచ్చును.
ఇక మిగిలిన ‘ప్రస్తుత అధ్యక్ష’ వర్గం తమకు ఉన్న అండర్ డాగ్ ఇమేజీకి తగినట్లుగా ఎవ్వరి ఊహకీ అందకుండా తమ వర్గ నాయకులందరితో తమకే అలవాటైన ఖచ్చితమైన పద్దతిలో అమెరికా వ్యాప్తంగా సభ్యుల్ని గుట్టుగా చేరుస్తూ, పని కానిస్తున్నారు. అనేకమంది ముఖ్యులు, సన్నిహితులు సమన్వయంతో ఎవరికి వారు స్వంత బడ్జెట్ తో పద్దతిగా చేర్పించడం వీరి విలక్షణమైన శైలి. తమ వర్గానికి చెందిన ఓట్లు పక్కా గా సమీకరించి గలిగే సమర్దత తో బాటు ‘తమ’ అనుకునే ప్యానెల్ ను ఏమాత్రం చర్చల్లోకి రానీయకుండా టీం స్పిరిట్ నిలపడం మరియు ప్రత్యర్థులందరూ కలగలిసినా పోటీ ఇవ్వగలిగే సామర్ధ్యం పొందడమే ధ్యేయంగా పనిచేయడం, పరిణామాలపై ఆసక్తి కలిగిస్తోంది.
ఇక చివరిగా ‘తానా’ సంస్థ స్ఫూర్తి మరియు నియమాలకు విరుద్ధంగా ఇంచుమించు రెట్టింపు చేస్తున్న ఈ సభ్యత్వాల మూలంగా అన్ని వర్గాలకూ ఉన్న అభద్రతా భావం తెలుస్తుంది. అలాగే ఆధిపత్యం కోసం ఎంతకైనా తెగించే తత్త్వం బయటపడ్తుండగా తాము ఆశించే విజయ అవకాశాలు కోసం రెట్టింపు సమయం, డబ్బు కృషి అవసరం అవుతుందని లోలోపల భయ పడ్తున్నారు. పైకి తెలియకుండా దాస్తున్నప్పటికీ, ప్రతి వర్గానికి మిగతా రెండు వర్గాల నాయకుల పై గొంతుదాకా ఉన్న కసి ఎన్నికల అవగాహనకు ప్రయత్నించినా, ఆ అవగాహనా పైపైనే ఉండి, రివెంజ్ అజండా ముందుకు వచ్చే అవకాశాలే ఎక్కువ అని, ‘చేంజ్’ ప్యానెల్ చీలికే అందుకు పెద్ద ఉదాహరణ అనీ, మళ్ళీ ఎన్నికలు తధ్యమనీ ఎక్కువ మంది భావిస్తున్నారు.
ఇదంతా గమనిస్తున్న సామాన్య ప్రజలు మాత్రం ‘తానా’ సంస్థ ఆశయమైన సేవా కార్యక్రమాలకు సొమ్ము ఇవ్వడానికి ముందుకు రాని చేతులు, సభ్యుల చేర్పింపుకు మాత్రం మిలియన్ల కొద్దీ బయటకు తీయడంతో ఈ నాయకుల అసలు అజండా బయట పడుతున్నట్లు భావిస్తున్నారు.
// మాజీ ‘తానా‘ బోర్డు చైర్మన్ ‘సతీష్ చిలుకూరి‘ లీడర్షిప్ కి వ్రాసిన లేఖను ఇక్కడ చూడండి //
Dear TANA leaders,
I am writing to all of you to ask for your help. Most of you took on the leadership responsibility in TANA promising “change” and do things the right way.
I am hearing that circus of TANA membership is in full swing with thousands of new members. This only happens for one month every two years and only happens when TANA elections are certain. All of a sudden, we see several thousand members take TANA membership just before the voting eligibility deadline. We all would be delighted if all these members are truly aligned with TANA goals/principles, having genuine interest in TANA, paying dues on their own and identify themselves as members of TANA. But that is not the case with many of them.
I am hearing that few people are spending hundreds of thousands of dollars to enroll members. Looks like this is happening in the open, without any care of TANA, without any hesitation or shame. What is more shocking is that people who are taking to money to join as a TANA member are professionals with a good education. What a shame..
We talk to about dignity, pride and self-respect of Telugu people. Is this the self-respect? Both people giving money and taking money for TANA membership have no dignity or self-respect. Will TANA be a stronger organization by enrolling people like this?
This is a game played by few puppet masters and these membership drives are orchestrated to win TANA elections. These practices started in the last 10 or 12 years. Do we need this in TANA? Why is this happening in TANA and why is TANA being a victim to this?
Telegu people in North America are extremely successful in their careers and businesses. This has brought lot of wealth to so many of us. Wealth brought humbleness in many but arrogance to few. There is a need for show trophies and control to satisfy the personal ego. People are ready to spend lots of money to buy memberships in TANA to own TANA. It is time to push back on this and send a clear message that this is not encouraged and TANA is not for sale.
TANA is a community service organization that needs and wants people who truly believe in its values and principles. Not those who want to buy it and own it.
I am asking for your help on these 2 things:
1) Please raise your voice, speak up against these practices and do what you can to stop it
This is our organization. You all took an oath to protect TANA and do what is right for TANA. Several of you promised “change”. You want to welcome genuine members, but you don’t want to encourage election memberships.
Stand-up and protest these bad practices openly in public and in your meetings. Call them out openly and make people who are paying for memberships and people who are taking money to join TANA be ashamed.
As elected leaders of TANA, each of you has the power, authority and most importantly the responsibility to stop these bad practices. If necessary, cancel the memberships of financiers, facilitators, and buyers of these election membership drives.
You also have the power to verify the membership roles for the last 45 years, if you want to clean-up this mess for good.
2) Support a bylaw change to stop this in the future
Most of you may not know this. Until ~15 years ago, TANA life membership used to be $250 and a new life member has to wait for 3 years before they can vote in TANA elections. These were changed (to $125 life membership and voting in 1 year), some say to protect TANA from few bad actors at that time, and some say to have control of TANA. I don’t know the explicit reasons for these changes as I was not close to it at that time.
Irrespective of the reason, those changes gave an opportunity for several bad practices to take hold in the organization. Election manipulation through purchased memberships became a common place. It is time to stop this.
I will be proposing a change in bylaws committee to restore old rules back into bylaws for the next term. Please consider this and support it when it comes to you.
TANA is our organization. It has clear goals and purposes. We have a proud history. It has a soul, a character, and values. These will live on for a long time, only if we standup and fight for these.
I am very proud to say I am a member of TANA. I will always stand up and fight for what is in the best interest of TANA. I am sure you will all do the same.
Thank you all so much.
Best regards,
Sateesh Chilukuri