1.’తానా ఫౌండేషన్’ సహకారంతో బీజేపీ జిల్లాకార్యాలయంలోవరద సహాయ కార్యక్రమాల్లో సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాల పంపిణి.
వరద బాధితుల సహాయ కార్యక్రమాల్లో పాల్గొని సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు ‘తానా ఫౌండేషన్’ చైర్మన్ ‘వల్లేపల్లి శశికాంత్’ సహకారంతో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ. అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో, ముఖ్య అతిధులుగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, మరియు బిజెపి స్టేట్ మీడియా ఇన్ చార్జ్ శ్రీ. పాతూరి నాగభూషణం బీజేపీ జిల్లా కార్యాలయంలో నూతన వస్త్రాలు పంపిణీ చేశారు..
ఈ కార్యక్రమంలో రమేష్, శ్రీధర్ గారు, సుబ్బయ్య, మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు.
2. అవనిగడ్డ
‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా’, ‘తానా ఫౌండేషన్’ సేవలు ఆదర్శనీయమని అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ అన్నారు.
శుక్రవారం మోపిదేవి మండలం బొబ్బర్లంకలో 200 వరద బాధిత కుటుంబాల వారికి ‘తానా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో పది రకాల నిత్యావసర సరుకులు, టవల్స్ సహాయంగా పంపిణీ చేశారు.
గ్రామంలోని ఒక్కొక్క కుటుంబానికి 5కేజీ ల బియ్యం.. 1కేజీ కందిపప్పు, 1 కేజీ గోధుమపిండి, 1కేజీ ఆయిల్ ప్యాకెట్, 1కేజీ సాల్ట్, 1/2కేజీ పుట్నాలపప్పు, 1/2 కేజీ వేరుశెనగ గుళ్ళు, 100 గ్రాముల సాంబార్ పౌడర్, 100 గ్రాముల పసుపు, 100గ్రాముల కారం, మరియు ఒక కండువా చొప్పున నిత్యావసర సరుకులను సంస్థ వారు అందజేశారు.
కృష్ణానది వరద ప్రభావిత ప్రాంతాల్లో ‘తానా ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఆరు వేల మంది బాధితులకు ఈ సహాయం అందించిన ‘తానా ఫౌండేషన్’ చైర్మన్ ‘వల్లేపల్లి శశికాంత్’ సేవలు స్ఫూర్తిదాయకమన్నారు.
కృష్ణానది వరదలతో సర్వం కోల్పోయిన లంక గ్రామాలలోని ప్రజలకు ఆపన్న హస్తం అందించడానికి ముందుకు వచ్చి జిల్లాల్లో సుమారుగా ఆరు వేల కుటుంబాలకు సహాయమందించిన ‘తానా’ సంస్థకు, ఛైర్మన్ ‘వల్లేపల్లి శశికాంత్’ కి, ఇతర ‘తానా ఫౌండేషన్’ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ‘తానా’ సభ్యులు చొరవను ప్రశంసించారు.
కార్యక్రమంలో సర్పంచ్ దొప్పలపూడి గంగాభవాని, టిడిపి గ్రామ అధ్యక్షులు దొప్పలపూడి జగదీష్, ఎఫర్ట్ సంస్థ ప్రతినిధి బీవీ రావు, వేమూరి వెంకటరావు, స్వచ్ఛంద కార్యకర్తలు శశికళ, సోనీబాబు, సుకన్య, దివ్య, రాము తదితరులు పాల్గొన్నారు.