• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్టు.. దారుణంగా హత్య చేసిన భర్త

admin by admin
September 13, 2024
in Around The World
0
0
SHARES
132
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఈ వార్తను చదివే ముందు ఒక స్పష్టమైన హెచ్చరిక చేయదలిచాం. మనసును వికలం చేసే ఈ దారుణ హత్యోదంతం గురించి చదివేందుకు ఆసక్తి ఉంటే మాత్రమే ముందుకు వెళ్లండి. నిజానికి ఈ వార్తకు సంబంధించిన సమాచారం చాలానే ఉన్నప్పటికి.. తగినంత మాత్రమే ఇస్తున్న పరిస్థితి. ఎందుకంటే.. ఇంత క్రూరంగా.. అత్యంత భయానకంగా ఒకరిని చంపటం.. అది కూడా భర్త ఆ పని చేయటం ఈ మొత్తం ఉదంతంలో షాక్ కు గురి చేసే అంశం.

భర్తను భార్రయ.. భార్యను భర్త హత్యలు చేసుకోవటం ఈ మధ్యన ఎక్కువైన సంగతి తెలిసిందే. అయితే.. ఇలాంటి ఉదంతాలు మధ్యతరగతి.. ఎగువ మధ్యతరగతిలో చోటు చేసుకుంటూ ఉంటాయి. కానీ.. ఒక సెలబ్రిటీ విషయంలో చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ వార్త వివరాల్లోకి వెళ్లే ముందు.. మరోసారి.. మనసును మెలి తిప్పేసి.. బాధకు గురి చేయటంతో పాటు.. కొందరికి వికారం కలిగించే వీలుంది. అందుకే.. మరోసారి ఆలోచించిన తర్వాత మాత్రమే దీన్ని చదివేందుకు ముందుకు వెళ్లండి. మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్టును ఆమె భర్త అత్యంత క్రూరంగా హత్య చేశాడు.

హత్య చేసిన అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలు మక్కలు చేయటమే కాదు.. బ్లెండర్ (మిక్సీ)లో వేశాడు. ఈ దారుణ హత్యకు సంబంధించిన వివరాల్ని స్విస్ అధికారులు వెల్లడించారు. మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్టు క్రిస్టినా జోక్సిమోవిక్. 38 ఏళ్ల వయసున్న ఆమెకు భర్త.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్విస్ దేశంలోని బాసెల్ నగరానికి సమీపంలోని బిన్నింగెన్ లోని తన ఇంట్లో ఆమె దారుణ హత్యకు గురయ్యారు. ఫిబ్రవరిలో జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగు చూసింది. తాజాగా ఆమె భర్త.. 41 ఏళ్ల రాక్షసుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేసిన రాక్షస కాండను అతను ఒప్పుకోవటంతో అతని బెయిల్ ను దేశ ఫెడరల్ కోర్టు రిజెక్టు చేసింది.

హత్య చేసిన వైనం గురించి తెలుసుకున్న పోలీసులు గగుర్పాటు గురవుతున్నారు. నిందితుడి మానసిక పరిస్థితి మీదా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతడి మానసిక పరిస్థితి ఏ మాత్రం సరిగా లేదని విచారణ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. తనను తాను కాపాడుకోవటం కోసమే హత్య చేసినట్లు చెబుతున్నా.. దానికి సంబంధించిన ఆధారాలు లభించలేదు. ఈ దారుణ హత్యకు సంబంధించిన నివేదిక ప్రకారం.. హత్య చేసి.. శరీర భాగాల్ని కత్తిరించి.. ఆ తర్వాత దాన్ని గ్రైండ్ చేసి.. రసాయన ద్రావణంలో కరిగించిన తీరు మనసుల్ని మెలి తిప్పేలా ఉందని చెప్పాలి.

హత్యకు గురైన బాధితురాలి విషయానికి వస్తే.. ఆమె మిస్ నార్త్ వెస్ట్ స్విట్జర్లాండ్ పోటీల్లో విజయం సాధించటమే కాదు.. 2007లో మిస్ స్విస్ టైటిల్ కోసం ఫైనలిస్టుగా నిలిచారు. ఈ హత్య గురించి తెలుసుకున్న బాధితురాలు స్నేహితురాలు తీవ్రమైన షాక్ కు గురయ్యారు. ‘‘తాను చాలా అందమైనది. ఆమె చాలా దయ కలిగిన మహిళ. ఇంత దారుణంగా హత్యకు గురి కావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఇప్పుడు ఆమె ఇద్దరి పిల్లల గురించి ఆలోచిస్తున్నా’’ అని పేర్కొన్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ హత్య ఆ దేశంలో సంచలనంగా మారింది.

Tags: brutally murderedHusbandmiss switzerland finalistshocking incident
Previous Post

ఆంధ్రోళ్లపై కౌశిక్ వివాదాస్పద వ్యాఖ్యలు

Next Post

‘తానా ఫౌండేషన్’ సహకారంతో పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాల పంపిణి!

Related Posts

Around The World

వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు

June 18, 2025
Around The World

నేను లేకుంటే ట్రంప్ ఓడేవారు.. మస్క్ సంచలనం

June 11, 2025
Around The World

సౌదీ రాజధాని రియాధ్ చరిత్రలో ప్రప్రధమంగా మహానాడు!

June 3, 2025
Around The World

ఒకేసారి 200 మంది ఖైదీలు జైలు నుంచి జంప్‌.. ఎలాగో తెలిస్తే మైండ్ బ్లాక్‌!

June 3, 2025
Around The World

బే ఏరియాలో ఘనంగా కృష్ణ 82వ జయంతి వేడుకలు!

June 2, 2025
Around The World

మహానాడు లో బుచ్చి రాం ప్రసాద్ ప్రసంగం మరియు ఫోటో గ్యాలరీ !

June 1, 2025
Load More
Next Post

'తానా ఫౌండేషన్' సహకారంతో పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాల పంపిణి!

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra