• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘తానా’ వ్యవస్థాపక అధ్యక్షులు ‘కాకర్ల సుబ్బారావు’ కన్నుమూత

admin by admin
April 16, 2021
in NRI, Trending
0
0
SHARES
428
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు కన్నుమూత – కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి – నెల రోజుల క్రితం అనారోగ్యంతో కిమ్స్ లో చేరిన సుబ్బారావు – ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కిమ్స్ వైద్యుల వెల్లడి – కాకర్ల సుబ్బారావు స్వస్థలం కృష్ణా జిల్లా పెదముత్తేవి, 1925 జనవరి 25న జన్మించారు – ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి వైద్య పట్టా పొందారు -పద్మావతి మహిళా వైద్యకళాశాల చైర్మన్‌గా చేశారు, ఉస్మానియా ఆస్పత్రిలో రేడియాలజిస్టుగా సేవలందించారు.

1951లో హౌస్‌ సర్జన్‌ చేసిన తర్వాత వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషికంతో అమెరికా వెళ్లారు. అమెరికా రేడియాలజీ బోర్డు పరీక్షల్లో 1955లో ఉత్తీర్ణులయ్యారు. న్యూయార్క్‌, బాల్టిమోర్‌ నగరాల్లోని ఆసుపత్రుల్లో 1954 నుంచి 56 వరకు పనిచేశారు. 1956లో స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. ఆ తర్వాత ఉస్మానియా కళాశాలలోనే ప్రధాన రేడియాలజిస్టుగా పదోన్నతి పొందారు.

నిమ్స్‌ అభివృద్ధికి విశేష కృషి..

1970లో సుబ్బరావు మళ్లీ అమెరికా వెళ్లారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వారి ఫెల్లో ఆఫ్‌ రాయల్‌ కాలేజి ఆఫ్ రేడియాలజిస్టు పట్టా పొందారు. ఆ తర్వాత అమెరికాలోని అనేక అసుపత్రులలో పనిచేశారు. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్ నార్త్‌ అమెరికా తొలి అధ్యక్షుడిగా సేవలందించారు. 1986లో ఎన్టీ రామారావు ప్రవాస ఆంధ్రులకు చేసిన విజ్ఞప్తి మేరకు కాకర్ల స్వదేశానికి తిరిగి వచ్చి హైదరాబాద్‌ నిమ్స్‌లో కీలక బాధ్యతలు చేపట్టారు. నిమ్స్‌లోని అన్ని విభాగాలను అభివృద్ధి చేశారు. రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటైన స్థాయికి నిమ్స్‌ను తీసుకొచ్చారు. రేడియాలజీ విభాగంలో అనేక పుస్తకాలు, జర్నల్స్‌లో పరిశోధనా వ్యాసాలు రాసిన డాక్టర్‌ కాకర్ల దేశ.. విదేశాలలో వైద్య ఉపన్యాసాలు ఇచ్చారు. 50 ఏళ్ల అనుభవంలో అనేక బహుమతులు, సత్కారాలు పొందారు. వైద్యశాఖకు, మానవాళికి చేసిన సేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు పొందారు.

Tags: tana kakrla subba rao
Previous Post

యన్.ఆర్.ఐ తెలుగుదేశం కువైట్ చంద్రన్న పుట్టినరోజు ఏర్పాట్లు 

Next Post

1953 BBC BR. AMBEDKAR INTERVIEW

Related Posts

NRI

యువతలో ‘లోకేష్’ పట్ల క్రేజ్ అద్భుతం-‘డాక్టర్ హరిప్రసాద్ కుట్టాంబాకం’

June 6, 2023
Trending

ఆమె మృతిపై డీజీపీకి చంద్రబాబు లేఖ

June 6, 2023
Trending

సీఐడీకి షాక్.. చంద్రబాబుకు ఊరట

June 6, 2023
Trending

ఉద్యోగులపై జగన్ కుట్ర బయటపెట్టిన పట్టాభి

June 6, 2023
Trending

సీఐడీ విచారణలో శైలజా కిరణ్ ఏం చెప్పారు?

June 6, 2023
Trending

షాతో భేటీపై వైసీపీకి చంద్ర‌బాబు షాకింగ్ రిప్ల‌య్

June 6, 2023
Load More
Next Post

1953 BBC BR. AMBEDKAR INTERVIEW

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • యువతలో ‘లోకేష్’ పట్ల క్రేజ్ అద్భుతం-‘డాక్టర్ హరిప్రసాద్ కుట్టాంబాకం’
  • మరో 3 వేల కోట్లు అప్పు…. జగన్ పై విమర్శలు
  • ఆమె మృతిపై డీజీపీకి చంద్రబాబు లేఖ
  • సీఐడీకి షాక్.. చంద్రబాబుకు ఊరట
  • ఉద్యోగులపై జగన్ కుట్ర బయటపెట్టిన పట్టాభి
  • సీఐడీ విచారణలో శైలజా కిరణ్ ఏం చెప్పారు?
  • షాతో భేటీపై వైసీపీకి చంద్ర‌బాబు షాకింగ్ రిప్ల‌య్
  • సందడిగా జరిగిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవం!
  • తాడేప‌ల్లికే ప‌రిమిత‌మైన పౌర్ణ‌మి సంద‌డి..!
  • నారా లోకేష్ మంగళగిరి లో రెండవ క్రీడా మైదానం ఏర్పాటు
  • ఆనంపై దాడి…జగన్ కు లోకేష్ డెడ్లీ వార్నింగ్
  • వైసీపీ మూకలను తరిమికొట్టిన ఆనం రమణారెడ్డి…వైరల్
  • టీడీపీ, బీజేపీల పొత్తుపై తేల్చేసిన బండి సంజయ్
  • టీడీపీ ఎమ్మెల్యే డోలా అరెస్ట్..కొండపిలో హై టెన్షన్
  • జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు

Most Read

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

ఏపీలో పెల్లుబుకుతున్న `అస‌హ‌న రాజ‌కీయం`.. రీజ‌నేంటి?

ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra