TANA మాజీ అధ్యక్షుడు జయశేఖర్ తాళ్ళూరి మాతృమూర్తి ‘భారతీ దేవి తాళ్ళూరి’ గారు అనారోగ్యంతో కన్నుమూశారు. ఫిబ్రవరి 19వ తేదీ తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. భారతీ దేవి పార్థివ దేహాన్ని ఆదివారం మధ్యాహ్నం ఆమె స్వగ్రామం ఇరవెండికి తీసుకువచ్చారు.
బూర్గంపహాడ్ మండలంలోని ఇరవెండిలో భారతీ దేవి అంత్యక్రియలు ఫిబ్రవరి 21వ తేదీ సోమవారం ఉదయం 10.00లకు నిర్వహించనున్నారు.
అమెరికాలోని తెలుగు కమ్యూనిటీ, ‘నమస్తే ఆంధ్ర’ యాజమాన్యం భారతీ దేవి గారికి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని,
ఈ కష్టకాలంలో జయశేఖర్ కి ప్రగాఢ సానుభూతిని, మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది.