‘తానా’ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అభ్యర్థిగా రంగంలో ఉంటూ అధికారంలో ఉన్న జయశేఖర్, లావు అంజయ్య తోడ్పాటే ముఖ్యబలంగా నెట్టుకొస్తున్న నిరంజన్ శృంగవరపు ప్రచారంలో తడబాట్లు పడుతుండటం విజయావకాశాలపై తీవ్రప్రభావం చూపిస్తోంది. ఎక్కువమంది అధికారంలో ఉన్న వారే తన సపోర్ట్ ఇనిచెపుతూ “చేంజ్” తమ నినాదం అంటుండడం ఓక వివాదమైతే, కోవిద్ సహాయ కార్యక్రమాలకు 100 వేలు విరాళం పై ఇతరులు ప్రశ్నిస్తుడటంపై ఇంతవరకూ ఇచ్చానని చెప్తున్నప్పటికీ ఈ మధ్యనే కొంత అస్పష్టతతో సమీకరించామని ఒకసారి లేదు ఇచ్చానని ఒకసారి తడబడటంతోపాటు రాజకీయపార్టీలతో తన బంధంగురించి చెప్పుకోవడం మరింత వివాస్పదం అవుతోంది.
మొట్ట మొదటిసారిగా సాక్షి టీ వీ ఇంటర్వ్యూ లో ఇంతవరకు ‘తానా’ కు ఉన్న రాజకీయ బంధాన్ని మార్చాల్సిన అవసరమని చెప్పగా దాన్ని ఎన్ఆర్ఐ టీడీపీ రచ్చ రచ్చ చేయగా, వెంటనే ఒక మీడియా క్లిప్ లో తాను వైసిపి పార్టీ అనుకూలతతో అనలేదని, ‘తానా’ లో పార్టీ ప్రమేయం వద్దని అన్నానని , తాను టీడీపీ అభిమాని అని చెప్పుకున్నారు . తరువాత రాలీ మీటింగులో అందరిముందు మళ్ళా తాను టీడీపీ అభిమాని అని టీడీపీ తోనే ఉంటానని చెప్పటానికి ప్రయత్నించగా అక్కడికి వచ్చిన ఇతర పార్టీల అభిమానులు ముఖం చిన్నబుచ్చుకొన్నారు. తాజాగా రెండు రోజుల క్రితం ఇచ్చిన టీవీ5 ఇంటర్వ్యూ లో తాను అందరికీ సమానంగా ఉండల్సిన ‘తానా’ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న విషయం కూడా విస్మరించి తాను టీడీపీ కార్యకర్తనని, పార్టీ నాయకులతో కలసి పనిచేశానని, పని చేస్తూనే ఉంటానని 5 నిమిషాల పాటు చెప్పి టీడీపీ వారిని సమాధానపరచ ప్రయత్నించటం కూడా ఇతర పార్టీల వారి దృష్టిలోనూ మరియు సాధారణ తెలుగు కమ్యూనిటీ లో కూడా విమర్శల పాలైంది.
అంతేకాక తన డొనేషన్ల లిస్టులో వివిధ రాజకీయ పార్టీలకు 40 లక్షల దాకా విరాళాలిచ్చానని చెప్పడం కూడా వివాదాస్పదం కాగా, డిట్రాయిట్ ఎన్నికల మీటింగ్ లో ‘శివరాం యార్ల గడ్డ’ ఒక కమిట్మెంట్ లేకుండా వివిధ పార్టీలకు విరాళాలివ్వడం ఫక్తు కార్పొరేట్ కల్చర్ కాదా అని ప్రశ్నించారు. ఇక అన్నిటికంటే హైలైట్ గా తెలుగుదేశం పార్టీ నిరంజన్ కు సపోర్ట్ చేస్తుందని, చంద్రబాబు సన్నిహితులే అల్ ది బెస్ట్ చెప్పినారు అని ఒక ఫేక్ డాక్యూమెంటును ‘తానా’ సభ్యులందరికీ పంపించటం ఒక పెద్ద వివాదం గా మారింది. ఆ డాక్యుమెంట్ ఇండియా నుండి ‘పాటిబండ్ల నాగ శ్రీనివాస్’ (ఫోన్ నెంబర్ 91 9494383663) నుండి ఎక్కువగా వస్తున్నది. ఆ డాక్యుమెంట్ కూడా ఇక్కడ ఇవ్వడమైనది. దీనిని చాల కాలంగా ఎన్ఆర్ఐ టీడీపీ నాయకుడిగా చెలామణి అయిన షేర్లొట్ లో నివసించే ‘చందు గొర్రెపాటి’ తీవ్రంగా నిరసిస్తూ తెలుగుదేశం ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరికీ ఎన్నికల్లో సపోర్ట్ చేసే అవకాశమే లేదనీ ఆలా చెయ్యాల్సి వస్తే నిజంగానే తమ ధనాన్ని సమయాన్ని వెచ్చించిన వారు ఎన్నికల్లో ఉంటె వారికి కాక ఈ కార్పోర్ట్ వాళ్లకు ఎందుకు సపోర్ట్ చేస్తారని ధ్వజమెత్తుతూ ఓక వీడియోను సర్క్యూలేట్ చేస్తున్నారు. ఇంకా ఒక వారం ఎన్నికల ప్రచారము లో ఇంకెన్ని వింతలూ చూడనున్నామో?
Recd this letter from Patibandla Naga Srinivas@+91 94943 83663