‘తానా’ 23వ కన్వెన్షన్ కిక్ ఆఫ్ కొలంబస్ లో అంగరంగ వైభంగా జరిగింది.
120 మంది దాతలు మరియు స్పాన్సర్లు హాజరైన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
ఈ ఈవెంట్లో $100,000 విరాళాలను సేకరించారు
‘తానా’ మాజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మరియు ‘తానా’ కన్వెన్షన్ కార్పొరేట్ చైర్ జగదీష్ ప్రభల సమన్వయంతో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
‘తానా’ నాయకులను మరియు కన్వెన్షన్ బృందాన్ని అర్చకులు చైతన్య శర్మ గారు, వారి బృందం ఆశీర్వదించారు.
కన్వెన్షన్‌కు UNITED సాఫ్ట్వేర్ గ్రూప్ CEO అంజు వల్లభనేని 25వేల డాలర్లను విరాళంగా ఇచ్చారు.
ఒక గ్లోబల్ కంపెనీ CEO బాలాజీ యడ్డం, ఒక గ్లోబల్ కంపెనీ గ్లోబల్ హెడ్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ జగదీష్ ప్రభల కూడా 25వేల డాలర్ల చొప్పున విరాళమిచ్చారు.
మంజీర పాలడుగు కూడా 25 వేల డాలర్లు ఇస్తానని ప్రకటించారు.
ERP అనలిస్ట్స్ CEO శ్రీకాంత్ గడ్డం రెడ్డి, గతి టెక్నాలజీస్ కు చెందిన వంశీ కోరా, స్ట్రాటెఫిక్ సిస్టమ్స్ CEO శంకర్ మంగాపురం, ఇతర స్థానిక వ్యాపారవేత్తలు కన్వెన్షన్‌కు మద్దతుగా విరాళాలు ఇస్తామని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ‘తానా’ అధ్యక్షుడు అంజయ్య చౌదరి, కన్వెన్షన్ కోఆర్డినేటర్ రవి పొట్లూరి, డెట్రాయిట్ తెలుగు సంఘం అధ్యక్షుడు కిరణ్ దుగ్గిరాల, మీడియా చైర్ శ్రీ అట్లూరి, తానా ఫౌండేషన్ ట్రస్టీ రవి సామినేని, కమిటీ సభ్యులు శివచావా, శ్రీకాంత్ మునగాల, వేణు చావా, సత్య బండారు, సిద్ధార్థ్ రేవూరు, కల్లి ప్రసాద్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
AIA ఏషియన్ ఇండియన్ అలైన్స్ ప్రెసిడెంట్ సంజయ్ సాదనా మరియు అతడి బృందం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
FIA ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ చైర్మన్ రామకృష్ణ కాసర్ల, మాజీ అధ్యక్షుడు రజనీకాంత్ కూడా హాజరయ్యారు.
ఆంధ్రా పీపుల్ ఆఫ్ సెంట్రల్ (APCO) OH అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మన్నె నాగేశ్వరరావు, మురళి పుట్టి, సంగా శ్రీనివాస్, ట్రస్టీలు వేణు తలసిల, శ్రీధర్ వర్మ, మరియు వేణు పసుమర్తిలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
TACO నుండి ప్రదీప్ చందనం, తేజో వట్టి, గణేష్ వత్యం, వెంకట్ పత్తిపాటి, శ్రీకాంత్ మునగాల, జగన్ చలసాని పాల్గొన్నారు.
CTA కొలంబస్ తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్ మధు మరియు మొత్తం కమిటీ సభ్యులు కూడా పాల్గొని ‘తానా’కు మద్దతు ప్రకటించారు.
ప్రముఖ సాంస్కృతిక బృందం గీతాంజలి వ్యవస్థాపకులు భరత్ జటప్రోలు, కీర్తిలు తమ మద్దతు ప్రకటించారు.
CWCC కొలంబస్ మహిళా కమిటీ అధ్యక్షురాలు అనూష కొప్పుల, శ్రీమతి బాబు మాగంటి, శ్రీశాంతి పసుమర్తి మరియు ఆమె బృందం మొత్తం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మంజూష ప్రభల, విక్రమ్ ప్రభల, ఫణి కప్ప, అశ్విన్ వేమూరి, కిషోర్ దోనెపూడి, శ్రీనివాస్ పోలిన, దుర్వాసుల శాస్త్రి, మనోహర్ నాయుడు, వల్లభ తేజ, నవీన్ నందమూరి, జానకి బెల్లాన, శ్రీ మరియు శ్రీమతి సంధ్య, వినోద్ కోసికె, సత్య యర్రంశెట్టి, ఆయన కుటుంబ సభ్యులు, హనుమాన్ తాడిపర్తిలతో పాటు పలువురు స్థానిక TANA మద్దతుదారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ‘తానా’కు తమ మద్దతు తెలిపారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు రుచికరమైన బఫే ఏర్పాటు చేసిన దావత్ రెస్టారెంట్ యజమాని టీపీ రెడ్డి మరియు ఆయన బృందానికి కార్యక్రమ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.