ఏపీలో నేతలకు కరోనా చుక్కలు చూపిస్తోంది చోటా మోటా నేతల నుంచి బడా నేతల వరకు పిట్టల్లా రాలిపోతున్నారు. కీలక నేతలు దీని బారినపడ్డారు. కొందరు మరణించారు. తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్, టీడీపీ నేత సబ్బంహరి, బీజేపీ నేత మాణిక్యాలరావులను కరోనా బలితీసుకున్న విషయం తెలిసిందే.
ఇంకా పలువురు నేతల దీని బారిన పడ్డారు. మొదటి విడతలో తప్పించుకున్న వారికి రెండో విడతలో సోకుతోంది. తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారంతో పాటు ఆయన భార్యకు కరోనా సోకింది.
వారం రోజుల కిందట తమ్మినేని సీతారం భార్య వాణిశ్రీ శ్రీకాకుళంలోని మెడికల్ ఆస్పత్రిలో చేరారు. మళ్లీ నాలుగు రోజుల కిందట స్పీకర్ కూడా కరోనా లక్షణాలతో అదే ఆస్పత్రిలో చేరారు. ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉందంటున్నారు.
ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి, తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవికి, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి కరోనా సోకిన విషయం తెలిసిందే.