అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ లో అసహనం పెరిగిపోతున్నట్లుంది. జనాల్లోకి వెళ్ళినపుడు తనను నిలదీస్తున్న జనాలపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటనే దీనికి ఉదాహరణ. గడపగడపకు వైసీపీ కార్యక్రమంలో తన నియోజకవర్గం ఆమెదాలవలసలోని మండల కేంద్రం నెల్లిపర్ల గ్రామంలో పర్యటించారు. కార్యక్రమం మొదలైన దగ్గర నుండి జనాలు తమ సమస్యలు చెప్పుకుంటునే ఉన్నారు. దీంతో తమ్మినేనిలో అసహనం ఎక్కువైపోయింది. తాను చెప్పింది వినకుండా జనాలు తమ సమస్యలను చెప్పుకోవటాన్ని స్పీకర్ సహించలేకపోయారు.
ఈ నేపధ్యంలోనే ఒక మహిళ తమ్మినేనితో మాట్లాడుతు తన అత్తకు పెన్షన్ నిలిపేసినట్లు ఫిర్యాదుచేశారు. ఈ విషయాన్ని అధికారులతో మాట్లాడుకోవాలని చెప్పి వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులను కూడా ఆదేశించారు. తర్వాత అదే మహిళ తనను అంగన్వాడీ టీచర్ గా ఆరు మాసాల క్రితం తొలగించారని చెప్పి అందుకు కారణం చెప్పమని స్పీకర్ ను నిలదీశారు. ఇతర మహిళలు ఏవో సమస్యలు చెప్పటానికి ప్రయత్నిస్తే సదరు మహిళ ముందు తన ప్రశ్నకు సమాధానం చెప్పాలని పట్టుబట్టింది. దాంతో స్పీకర్లో అసహనం కట్టలు తెంచుకున్నది.
టీచర్ గా ఎందుకు తొలగించారో తనకు తెలుసనని అయినా చెప్పనని చెప్పి నీకు దిక్కున్నచోట చెప్పుకోమని గట్టిగా అరిచారు. గ్రామంలోని సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిద్దామని తాను వస్తే వెంటపడి ఒక్కదానికే సమస్యలున్నట్లు పదేపదే మాట్లాడటం ఏమిటంటు మండిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వైరల్ అయ్యింది.
ఇక్కడ విషయం ఏమిటంటే నెల్లిపర్లని కాదు కానీ స్పీకర్ కు సహనం తక్కువే. నేతలు తమ దగ్గరకు వచ్చినపుడే జనాలు సమస్యలను చెప్పగలరు. ఇపుడు తమ్మినేని పాల్గొన్న గడపగడపకు వైసీపీ కార్యక్రమం కూడా సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిందే. తమ్మినేనిలో అసహనం ఎక్కువైపోతోందని పార్టీలోనే టాక్ వినిపిస్తోంది. దానికి నియోజకవర్గంలో పెరుగుతున్న వ్యతిరేకత కూడా కారణమే అయ్యుండచ్చని అనుమానం. వచ్చేఎన్నికల్లో ఫలితం ఎలాగుంటుందో స్పీకర్ అంచనా వేయలేకపోతున్నారా అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.
దిక్కున్న చోట చెప్పుకో అంటూ మహిళల పై అరుస్తూ, నడి రోడ్డు పై తమ్మినేని వీరంగం
నకిలీ డిగ్రీల తమ్మినేని… అవినీతిలో గొప్ప జ్ఞాని#TammineniSitaram#AndhraPradesh #JaganLosingIn2024#ByeByeJaganIn2024 #PsychoPovaliCycleRavali #JaganPaniAyipoyindhi #JaganFailedCM pic.twitter.com/FrnNDev86P— Telugu Desam Party (@JaiTDP) June 28, 2023