ఏపీలో రాజకీయాల్లో ‘‘ హుందా తనం’’ అడ్రస్ లేకుండా పోయింది. అధికార పార్టీ నేతలు రాజ్యాంగం అతిక్రమించి మాట్లాడేస్తున్నారు. కులం, మతం వాడేస్తున్నారు. చివరకు గౌరవ పోస్టుల్లో ఉన్నవారి వ్యాఖ్యలే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
తాజాగా తమ్మినేని సీతారాం… మరోసారి వివాదాస్పదంగా ప్రవర్తించారు. స్పీకర్ అంటే 175 ఎమ్మెల్యేలకు చెందిన మనిషి. ఆయనకు పార్టీ పక్షపాతం ఉండకూడదు. కానీ తమ్మినేని స్వయంగా నేను వైసీపీ వ్యక్తినే అని ప్రకటించుకున్నారు. ఇంక అందరూ నోరెళ్లబెట్టడం తప్ప ఏం చేయగలరు.
తాజాగా ఆయన శ్రీకాకుళం జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పేదల కోసం మాట్లాడే టీడీపీ నేతలు, చంద్రబాబు ఇళ్ల పట్టాల విషయంలో ఎందుకు కోర్టులకు వెళ్లారో సమాధానం చెప్పాలని సీతారామ్ డిమాండ్ చేశారు. పేదలకు మేలు జరుగుతుంటే చంద్ర బాబు ఎందుకంత అసూయ పడుతున్నారని ప్రశ్నించారు. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల రాకుండా చేశారని 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నారు అని తమ్మినేని సీతారామ్ ప్రశ్నించారు.
అయితే, ఇక్కడ ఒక విషయం గమనించాలి. కోర్టకు వెళ్లింది చంద్రబాబు కాదు, టీడీపీ పార్టీ కాదు. ఎవరో వ్యక్తులు, నేతలు కోర్టుకు వెళ్లారు. 30 లక్షల మందికి స్థలాలు అని వైసీపీ చెబుతున్నవాటిలో 25 లక్షల మందికి ఇచ్చేవి వివాదం రహితంగా ఉన్నాయి. కానీ రాజకీయంగా చంద్రబాబును డ్యామేజ్ చేయడం కోసం ఆ 27 లక్షల మంది స్థలాలను వైసీపీ సర్కారు పెండింగ్ పెడుతోంది.
వివాదరహితం కాని స్థలాలను వైసీపీ పెండింగ్ పెట్టిన విషయాన్ని తమ్మినేని సీతారాం గారు ఎందుకు మాట్లాడటం లేదు ?
కోర్టులో పెండింగ్ లో ఉన్న స్థలాలు తప్ప ఇతర స్థలాలు ఎందుకు పంచడం లేదు?
చంద్రబాబు హయాంలో పూర్తిగా కట్టిన ఇళ్లను పేదలకు పంచకుండా వైసీపీ ఏం చేస్తోంది.
చంద్రబాబు హయాంలో 90 శాతం పూర్తయిన ఇళ్ల నిర్మాణాలను మిగతా 10 శాతం ఎందుకు పూర్తి చేసి పేదలకు పంచడం లేదు?
ఈ ప్రశ్నలకు వైసీపీ తెలిసినా సమాధానం చెప్పదు. ఎందుకంటే… పేదలకుఇళ్ల స్థలాలు పంచడం సెకండ్ ప్రయారిటీ. పేదల ఇళ్ల స్థలాలు ఎంత కాలం వాయిదా పడితే వైసీపీ అంతకాలం రాజకీయ ప్రయోజనాలు పొందవచ్చన్నది వైసీపీ వ్యూహాత్మక అడుగు.