తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత భారీ ఎత్తున ఆస్తులు పోగేసుకున్నారనే వాదన అందరికీ తెలిసిందే. ఆయన మృతి చెందిన తర్వాత.. చాలా ఏళ్లకు తాజాగా వాటి వివరాలు తెరమీదికి వచ్చాయి. ఇప్పటి వరకు జయలలిత ఎంత పోగేసుకున్నారు? వాటిలో ఏమేమున్నాయనే విషయం ఎవరికీ తెలియ దు. కానీ, తాజాగా బెంగళూరు కోర్టు.. తమిళనాడు ప్రభుత్వానికి 6 పెద్ద పెద్ద ట్రంకు పెట్టెలు తీసుకువచ్చి.. జయలలిత బంగారాన్ని తీసుకువెళ్లాలని ఆదేశించడంతో .. ఈ వివరాలు వెలుగు చూశాయి.
కోర్టు వెలువరించిన లెక్కల ప్రకారం.. తాజాగా మార్కెట్లో ఈ బంగారం, వజ్రాలు, వజ్రాభరణాలు, వెండి ఆభరణాలు, వెండి ఇటుకల విలువ.. 2 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధికారిక లెక్క ప్రకారమే వీటి విలువ 3 వేల కోట్ల వరకు ఉంది. ఇక, కోర్టు వెలువరించిన లెక్కల ప్రకారం.. కిలోల కొద్దీ బంగారం, నగలు.. అంతకు మించిన వజ్రాలు ఉన్నాయి. ఇక, ఎంత లెక్కపెట్టినా తరగనంత వెండి వస్తువులు కూడా పోగుపడ్డాయి.
ఇవీ వివరాలు..
7 వేల కిలోల బంగారు ఆభరణాలు- 468 అధునాతన డిజైన్లతో ఉన్నాయి.
7 వందల కిలోల వెండి ఇటుకలు.
6 వందల కిలోల వెండి ఆభరణాలు- 800 రకాల డిజైన్లు
52 వేల పట్టు చీరలు- ఇవన్నీ ఒక్కొక్కటీ 2 లక్షల రూపాయల పైనే విలువ
రత్నాలు పొదిగిన చెప్పులు.. 2 వేల జతలు
రత్నాలు పొదిగిన చేతికర్రలు 50
బంగారు సింహాసనం చిన్నది దీని బరువు 20 కిలోలు.
వీటిని ఏం చేస్తారు?
వీటన్నింటినీ తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని జయలలిత పేరిట ఒక మ్యూజియం ఏర్పాటు చేసిన దానిలో భద్ర పరచనున్నారు. ఇక, జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న 27 కిలోల నగల్లో 7 కిలోల నగల్ని విక్రయించడానికి న్యాయస్థానం నిరాకరించింది. మిగిలిన నగలను మాత్రమే వేలం వేయాలని పేర్కొంది.
అంతా అక్రమ సొమ్మే! ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జయలలిత అక్రమ ఆస్తులు కూడబెట్టారనేది బహిరంగ రహస్యం. ఈ కేసులో గతంలో ఆమె జైలు శిక్ష పడాల్సి ఉంది. అయితే.. అనారోగ్యంతో ఆమె ఆసుపత్రిలోనే మృతి చెందారు.