ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది స్టార్ హీరోయిన్ తమన్నా. కెరీర్ షురూ చేసి ఏళ్లకు ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికి తన రూపులో తేడా రాకుండా ఉండేలా చూసుకోవటంలో తమన్నాకు మించినోళ్లు మరెవరూ ఉండరనే చెప్పాలి. వయసు మీద పడుతున్నాఈ మిల్కీ బ్యూటీ సొగసు మాత్రం తగ్గటం లేదు. వయసు మీద పడుతున్నప్పుడు ముఖంలోనో.. బాడీ షేప్ లోనో అంతో ఇంతో మార్పు తప్పనిసరి.
కానీ.. అందుకు భిన్నంగా మొదట్లో ఎలా అయితే సన్నజాజి మెగ్గలా ఉందో.. ఇప్పటికి అలానే ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గ్లామర్ ఇండస్ట్రీలో దశాబ్దానికి పూనే ఉన్న ఆమెపై ఎప్పుడూ ఎలాంటి రూమర్స్ వినిపించవు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉంటే.. ఏదో ఒక టాక్ నడుస్తూనే ఉంటుంది. కానీ.. అందుకు మినహాయింపుగా కనిపిస్తారు తమన్నా. తాజాగా ఆమె ఒక చేత్తో సినిమాలు మరో చేత్తో ఓటీటీలకు పని చేయటమే కాదు.. తాజాగా ఒక చానల్ నిర్వహిస్తున్న షోలో పాల్గొంటూ అలరిస్తున్నారు.
తన వ్యక్తిగత విషయాల్ని పెద్దగా షేర్ చేసుకోని తమన్నా.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా తాను ఒక హెల్త్ ఇష్యూతో ఇబ్బంది పడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఇందుకు కారణాన్ని చెబుతూ.. తన ఆహారపు అలవాట్లు.. జీవన విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయని.. ఇదే తన ఆరోగ్యాన్ని దెబ్బ తీసిందన్నారు. కొన్నేళ్ల క్రితం సరైన ఫుడ్ హాబిట్స్ ఉండేవని.. డిఫరెంట్ లుక్స్ కోసం ఎక్కువగా వర్కౌట్ చేశానని.. దీంతో తనకో ఆరోగ్య సమస్య వచ్చిందన్నారు. ఇప్పుడు ఆ సమస్య నుంచి బయటపడేందుకు సేంద్రీయ ఆహార పదార్థాల్ని మాత్రమే తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఇంతకీ ఆమె ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య ఏమిటన్నదాని వివరాల్ని వెల్లడించనప్పటికీ.. తాను ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యకు కారణాల్లో కీలకమైనది.. ఒక డైటీషన్ ను నియమించుకోకపోవటమని చెప్పారు. కెరీర్ మొదట్నించి ఒక డైటీషియన్ ను తాను నియమించుకొని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం ఆమె చెబుతున్నారు.
ఫిట్ నెస్ ట్రైనర్ సలహాలతో వర్కుట్స్ చేస్తున్నానని.. స్లిమ్ గా ఫిట్ గా ఉండేందుకు ద్రవ పదార్థాల ఎక్కువగా తీసుకుంటున్నట్లు చెప్పింది. ఒక స్టార్ నటి సైతం.. సాదాసీదా వ్యక్తుల మీదిరి తప్పులు చేయటం విస్మయానికి గురి చేస్తోంది. ఒక మోస్తరు సెలబ్రిటీలు సైతం తమకంటూ ప్రత్యేకంగా ఒక డైటీషియన్ ను ఏర్పాటు చేసుకుంటారు. మరి.. తమన్నా ఆ విషయాన్ని ఎలా మిస్ అయ్యారు?