• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఆ టీడీపీ నేతల గొంతు నొక్కిన జగన్

అచ్చెన్నాయుడు, రామానాయుడుల మైక్ కట్ చేసిన ప్రివిలైజ్ కమిటీ

admin by admin
September 22, 2021
in Andhra, Politics, Trending
0
0
SHARES
296
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తన హయాంలో జగన్ ఏపీలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ నేతలకో నీతి, విపక్ష నేతలకో నీతి అన్న చందంగా తయారైంది జగన్ పాలన. టీడీపీ నేతలపై, టీడీపీ అధినేత చంద్రబాబుపై జగన్ సహా మంత్రి కొడాలి నాని, ఇతర ఎమ్మెల్యేలు తీవ్ర పదజాలంతో దూషణలకు దిగుతున్న వైనం యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. ఇక పవిత్రమైన అసెంబ్లీలో సైతం చంద్రబాబు అనుభవాన్ని,వయసును కూడా మరచిపోయి వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన హంగామా తాలూకు వీడియోలు వారి ప్రవర్తనకు నిలువెత్తు సాక్ష్యాలు.

తమ అధినేతపై అధికార పార్టీ నేతలు గుప్పిస్తున్న అసత్య ఆరోపణలు, పసలేని విమర్శలను తిప్పికొట్టేందుకు టీడీపీ నేతలు కూడా సభా మర్యాదను పాటిస్తూనే విమర్శించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన అసెంబ్లీ ప్రివిలైజ్ క‌మిటీ స‌మావేశంలో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడులపై సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్‌ ను వ్య‌క్తిగ‌తంగా దూషించారన్న సాకుతో టీడీపీ శాస‌న‌స‌భాప‌క్ష ఉప‌నేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడులపై చర్యలు తీసుకున్నారు.

ఈ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగిన‌న్ని రోజులూ.. వారిద్దరికీ మైక్ ఇవ్వ‌కూడ‌ద‌ని ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది. అయితే, ఈ ప్ర‌తిపాద‌న‌ల‌ను ప్రివిలైజ్ క‌మిటీ స‌భ్యుడు అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌ వ్య‌తిరేకించారు. రామానాయుడిని సీఎం జగన్.. డ్రామా నాయుడు అన్నారని, దానికి బదులుగా రామానాయుడు వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. కావాలంటే రికార్డుల‌ను ప‌రిశీలించుకోవాల‌ని కూడా సత్యప్రసాద్ సూచించారు.

అచ్చెన్నాయుడు, రామానాయుడికి అసెంబ్లీ స‌మావేశాల్లో మైక్ ఇవ్వ‌కూడ‌ద‌నే తీర్మాణాన్ని ప్రివిలైజ్ క‌మిటీ.. స్పీక‌ర్‌కు పంపనుంది. అదేవిధంగా నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్ లేఖ‌ను కమిటీ పరిశీలించింది. అలాగే కూన ర‌వికుమార్ లేఖ‌ను కూడా ప‌రిశీలించింది. ఏది ఏమైనా అధికార పార్టీ నేతలకు ఒక న్యాయం, విపక్ష నేతలకు ఒక న్యాయం అంటూ విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీలో తనను ప్రశ్నించే ఆ ఇద్దరి గొంతు నొక్కాలన్న ఉద్దేశ్యంతోనే జగన్ ఇలా చేశారని అంటున్నారు.

Tags: ap tdp chief achennaidumic cutnimmala ramanaiduno mic for achennaidu and ramanaiduprevilage committee
Previous Post

ఆ తప్పు చేసి హెల్త్ ప్రాబ్లం తెచ్చుకుందట

Next Post

టీటీడీ పాలకమండలి నియామకం…జగన్ కు హైకోర్టు షాక్

Related Posts

Trending

ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం

March 26, 2023
Top Stories

రాహుల్ ప్రెస్ మీట్ ఫొటోతో మోడీకి షాక్

March 26, 2023
Trending

జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు

March 26, 2023
Telangana

సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?

March 26, 2023
Trending

మహిళలకు ధర్మాన బెదిరింపు?

March 26, 2023
Trending

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 175 కాదు…17 ఎక్కువ‌

March 26, 2023
Load More
Next Post

టీటీడీ పాలకమండలి నియామకం...జగన్ కు హైకోర్టు షాక్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఆ మాటతో సజ్జల పరువు తీసిన ఆనం
  • రాహుల్ ప్రెస్ మీట్ ఫొటోతో మోడీకి షాక్
  • జగన్ పై ఉండవల్లి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు
  • సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?
  • విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?
  • మహిళలకు ధర్మాన బెదిరింపు?
  • వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 175 కాదు…17 ఎక్కువ‌
  • రాసిపెట్టుకోండి.. 2024లో వైసీపీ డిస్మిస్ ఖాయం: కోటంరెడ్డి
  • చంద్రబాబు ముందు జగన్ అమూల్ బేబీ :లోకేష్
  • నేను సావర్కర్ కాదు..గాంధీని..రాహుల్ పంచ్ అదిరింది
  • వివేకా కేసులో మరో ట్విస్ట్…సీబీఐకి షాక్
  • శాన్ ఫ్రాన్సిస్కోలో ఖలిస్తానీ తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఏకమైన స్థానిక కాలిఫోర్నియా భారతీయులు!
  • ఏపీ అప్పుల కుప్పే… క‌ళ్లు బైర్లు క‌మ్మే నిజాలు ఇవే..!
  • నెల్లూరు రెడ్ల హిస్ట‌రీలో `1983 రిపీట్`!
  • మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

Most Read

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

పవన్ ఈ స్పీడేంటి సామీ !

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

‘భగత్ సింగ్’ తన తండ్రికి రాసిన చివరి లేఖ!

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra