అమరావతి రాజధాని ప్రాంతంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ళ నిర్మాణం సస్సెన్సుగా మారింది. కొత్త జోన్లో 50 వేలమందికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టాలిచ్చిన విషయం తెలిసిందే. ఈ పట్టాల్లో అందరికీ పక్కా ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం అనుకున్నది. అనుకున్నట్లుగానే ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం కింద ఇళ్ళని మంజూరు చేయాలని అడిగింది. అందుకు కేంద్రంగా కూడా సానుకూలంగా స్పందించి మొదటివిడతలో 47 వేళ్ళ ఇళ్ళని మంజూరుచేసింది.
ఇళ్ళ నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి భూమిపూజ చేయటమే ఆలస్యమని అనుకుంటున్న సమంలో అమరావతి ప్రాంతంలోని కిందరు కోర్టులో కేసువేశారు. ఆ కేసుపైన రెండు వైపుల వాదనలను హైకోర్టు విన్నది. విచారణ ముగించింది కానీ తీర్పు మాత్రం చెప్పలేదు. తీర్పును రిజర్వులోఉంచుతున్నట్లు జడ్జి ప్రకటించారు. అందుకనే తీర్పుపై సస్పెన్స్ కంటిన్యు అవుతోంది. దాంతో రండువైపులా తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని ఎవరికి వాళ్ళు అంచనాలు వేసుకుంటున్నారు.
సుప్రింకోర్టులో కేసు ఇంకా పూర్తికాకుండానే ప్రభుత్వం ఇళ్ళ నిర్మాణాలు చేపట్టడం చెల్లదని పిటీషనర్ల వాదన. సుప్రింకోర్టు పట్టాల పంపిణీకి మాత్రమే అనుమతించిందని, ఇళ్ళ నిర్మాణాలకు కాదని పిటీషనర్లు వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వం వాదన మరోరకంగా ఉంది. ప్రభుత్వం ఏమి వాదించిందంటే ఇళ్ళు నిర్మించేందుకే పట్టాల పంపిణీకి అనుమతులు అడిగినట్లు ప్రభుత్వం చెప్పింది. ఇళ్ళపట్టాల పంపిణీలోనే ఇళ్ళను నిర్మించబోతున్నట్లు తాము స్పష్టంగా చెప్పామని ప్రభుత్వం వాదించింది.
తమ వాదనతో ఏకీభవించిన కారణంగానే సుప్రింకోర్టు ఇళ్ళపట్టాలకు అనుమతించిందని చెప్పింది. కాబట్టి ప్రత్యేకంగా ఇళ్ళనిర్మాణాలకు అనుమతి అవసరంలేదన్నది ప్రభుత్వం వాదన. ఇక్కడే హైకోర్టు ఒక అనుమానాన్ని లేవనెత్తింది. విచారణలో అంతిమ తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే అప్పుడు ఇళ్ళనిర్మాణం పేరుతో ప్రభుత్వం చేసిన ఖర్చంతా వృధాయే కదా దాన్ని ఎవరు భరిస్తారు ? అని అడిగింది. అయితే ఆ ప్రశ్నకు ప్రభుత్వం ఏమి సమాధానం చెప్పిందన విషయంలో క్లారిటిలేదు. అందుకనే హైకోర్టు చెప్పబోయే తీర్పు సస్పెన్సుగా మారింది.