ఎవరైనా నాయకులు వారిని సదరు పార్టీ సస్పెండ్ చేస్తే.. ఒకింత బాధ పడతారు. అంతేకాదు.. అయ్యో.. మేం ఏంతప్పు చేశామని ఇలా చేశారు? అంటూ.. ఆవేదన వ్యక్తం చేస్తారు. పార్టీలోనే ఉంటామని కూడా అంటారు. కానీ, దీనికి భిన్నంగా.. వైసీపీ కి చెందిన సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు.. వ్యాఖ్యానించారు. `మా నెత్తిన పాలు పోశారు. ఈ నిర్ణయాన్ని ముందుగానే ఊహించాం“ అని సస్పెండ్ అయిన వారిలో ఇద్దరు కీలక ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించడం పార్టీలో సంచలనంగా మారింది.
వైసీపీ అధిష్టానం.. మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు.. గురువారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారని నిర్ధారించిం ది. ఈ క్రమంలో మేకపాటి చంద్రశేఖరరెడ్డి(నెల్లూరు జిల్లా ఉదయగిరి), కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి(నెల్లూరు జిల్లా రూరల్), ఆనం రామ నారాయణరెడ్డి(నెల్లూరు జిల్లా వెంకటగిరి), ఉండవల్లి శ్రీదేవి(గుంటూరు జిల్లా తాడికొండ)లపై వేటు వేసింది. అయితే.. వీరిలో ఇద్దరు మేకపాటి, కోటంరెడ్డిలు.. పార్టీ తీసుకున్న నిర్ణయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కోటంరెడ్డి ఏమన్నారంటే..
పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు వేయడంపై రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందిస్తూ.. ‘వైసీపీకి దూరంగా వెళ్తున్నానని మూడు నెలల కిందటే నేను చెప్పాను. నాపై చర్యలు తీసుకునే విధానం సరికాదు. షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా ఎలా చర్యలు తీసుకుంటారు. మొదట షోకాజ్ నోటీసు ఇచ్చి వివరణ కోరాలి. ప్రజాస్వామ్య పద్ధతిలో చర్యలు తీసుకోలేదు. చేతిలో అధికారం ఉందని సస్పెండ్ చేశారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. పార్టీలో పెత్తందారి విధానం నడుస్తోంది. పార్టీ నిర్ణయాన్ని సాదరంగా స్వాగతిస్తున్నాను. ఒకరకంగా నా నెత్తిన వాళ్లు(జగన్-సజ్జల) పాలు పోశారు’ అని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు.
మేకపాటి రియాక్షన్..
‘నేను ఎక్కడా తప్పు చేయలేదు. నేను జయమంగళ వెంకటరమణకే ఓటు వేశాను. దేవుడి మీద ప్రమాణం చేసి మళ్లీ చెబుతున్నా నేను తప్పు చేయలేదు. సస్పెన్షన్ చేసినందుకు సంతోషంగా ఉంది. ప్రజలు ఆదరిస్తే మళ్లీ గెలుస్తాను. నాకు 20 కోట్లు డబ్బులు ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారు. ఇదే మాట దేవునిపై ప్రమాణం చేసి చెబుతారా..? వైసీపీలోని కొందరు పెద్దల వల్ల సీఎం సహా అందరూ అవమానపాలవుతారు’ అని మేకపాటి అన్నారు.
సస్పెన్షన్ ఎంతో హ్యాపీగా ఉందని చెప్తున్నా మేకపాటి! ???????????????? pic.twitter.com/i1xn6o7Pn5
— యువతరమే యువగళమై (@GopiKrishnaBa15) March 24, 2023