ప్రస్తుతం జరుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఎన్నికల్లో నరేన్ కొడాలి బృందానికి చెందిన సునీల్ పాంత్రా `జాయింట్ కోశాధికారి(ట్రెజరర్) పదవి` కోసం బరిలో నిలిచారు. యువకులు, ఉత్సాహవంతులు .. పదిమందికీ ఏదైనా చేయాలనే తపన మెండుగా ఉన్న సునీల్ పాంత్రా.. తానా కోసం ఇప్పటికే అనేక రూపాల్లో సేవలు అందించారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో తనకు అవకాశం ఇస్తే.. మరిన్ని రూపాల్లో సేవ చేసేందుకు తాను ముందుంటానని చెబుతున్నారు. ఇప్పటికే కొన్నేళ్లుగా ఆయన తానాలో విశేష రూపాల్లో సేవలు అందిస్తున్నారు. సమాజ సేవతో పోటు సంగీత, సాహిత్య సేవలోనూ సునీల్ పాంత్రా ముందున్నారు. ఆయనను గెలిపించుకోవడం.. తెలుగు వారి సంస్కృతిని, సంప్రదాయాలకు పెద్దపీట వేయడమేనని అంటున్నారు పరిశీలకులు.
సునీల్ పాంత్రా అలంకరించిన పదవులు..
2019-21: సాంస్కృతిక సేవా కార్యక్రమాల సమన్వయకర్త
2017-19: తానా ఉత్తర ప్రాంతీయ ప్రతినిధి
2015-17: తానా మీడియా విభాగ అధ్యక్షుడు
2014-15: తానా 19వ మహాసభల మీడియా కమిటీ అధ్యక్షుడు
2011-13: తానా ప్రకటనల విభాగ అధ్యక్షుడు
2019 డీసీ సభల్లో తానా సాంస్కృతిక సేవా సమన్వయకర్తగా బాధ్యతలు
2019-20 మధ్య చేసిన సేవలు
అమెరికావ్యాప్తంగా ప్రముఖ అవధాని మేడసాని మోహన్చే 20కుపైగా ప్రవచన కార్యక్రమాలు. ప్రముఖ రచయిత జొన్నవిత్తులచే అమెరికా అంతటా 10కు పైగా సమావేశాలు. అమెరికాపై కోవిద్ పంజా విసిరి ప్రవాసులు గృహాలకే పరిమితం అయిన కాలంలో వారిని అలరించేందుకు అంతర్జాలం ద్వారా దేవిశ్రీ, థమన్, అనీల్ రావిపూడి వంటి సినీ సంగీత దర్శకులతో సంగీత విభావరి ఏర్పాటు. ప్రముఖ గాయని శోభారాజ్తో రెండు నెలల పాటు 600కు పైగా ప్రవాస చిన్నారులకు సంగీతంలో శిక్షణా తరగతులు. ఈ కార్యక్రమాన్ని చిన్నజీయర్ స్వామిజీ ప్రారంభించారు. అమెరికావ్యాప్తంగా 100కుపైగా చిన్నారులు ఈ కార్యక్రమం ద్వారా ఏడాది పొడవునా సంగీత తరగతుల్లో పాఠాలు నేర్చుకుంటున్నారు. 20మంది సంగీత కళాకారులతో ఎస్పీ బాలుకు నివాళి పేరిట ఏర్పాటు చేసిన అంతర్జాల కార్యక్రమంలో 50వేలకు ప్రవాసులు పాల్గొని గానగంధర్వుడికి నివాళులర్పించారు. కోవిద్ సమయంలొ తానా కేర్స్ సహకారంతో $6000 విలువైన ఆహారాన్ని పంపిణీ. కళాకారులకు కోవిద్ సమయంలో ఆర్థికంగా బాసట. అంతర్జాలంలో నిర్వహించిన బాలోత్సవానికి సహకారం. గత జులైలో నిర్వహించిన సాంస్కృతికోత్సవానికి 40దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక సమన్వయకర్తగా తోడ్పాటు. సెప్టెంబర్ 2020లో రామాచారి, డా.వైసరాజు సుబ్రహ్మణ్యంల నేతృత్వంలో తెలుగు డిజిటల్ ఐడల్ పోటీల నిర్వహణ. 1000మంది పాల్గొన్న ఈ పోటీల్లో ముగ్గురు తుది పోటీదారులకు తానా తరఫున బహుమతుల ప్రదానం. డిసెంబరు 2020లో అమెరికావ్యాప్తంగా ఉన్న 12 స్థానిక తెలుగు సంఘాలతో కలిసి 12 సురభి నాటకోత్సవాలను ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర. 2017 సెయింట్ లూయిస్ తానా సభల అనంతరం ఇండియన్ ఐడల్ రోహిత్ సంగీత విభావరి. చిన్నారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు క్యూరీ గణిత సాంకేతిక పోటీలు
సామాజిక కార్యక్రమాల్లోసునీల్ పాంత్రా ముందంజ
జన్మభూమిలో అభివృద్ధి కార్యక్రమాలకై 5కె రన్ నిర్వహణ. అమెరికా పాఠశాలల్లో పేద విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, బ్యాగుల(Backpacks) పంపిణీ. ఆపద సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడే రక్తదాన శిబిరాలు. “ప్రేరణ” పేరిట మహిళలకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి డెట్రాయిట్ పరిసర ప్రాంతాల్లో తెలుగు వారికి విశేష సేవలందించిన ప్రవాస ప్రముఖుల సతీమణులను ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించి గౌరవించారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న 400మందికి పైగా మహిళలు ఉల్లాసంగా పాల్గొన్నారు. డెట్రాయిట్ తెలుగు సంఘంతో కలిసి సంయుక్తంగా ఈ రెండేళ్లల్లో 16 క్రీడా పోటీలను నిర్వహించి 2000 మందికి పైగా క్రీడాకారులకు పతకాలు, ప్రశంసాపత్రాలను ఈ విభాగం అందజేసి అమెరికాలో ప్రవాస తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడా పోటీల చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. వాలీబాల్, బాస్కెట్బాల్, చిత్రలేఖనం, త్రోబాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ వంటి పోటీల్లో ప్రతి విభాగంలో 150కు పైగా ప్రవాసులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించారు. మిషిగన్ రాష్ట్రంలోని అన్ని భారతీయ సంఘాలకు ముఖ్య ప్రతినిధిగా నిలబడే ఇండియన్ లీగ్ ఆఫ్ అమెరికా(ILA) స్వాతంత్ర్య దినోత్సవ పెరేడ్లో సైతం తానా శకటానికి చోటు దక్కింది.
ఎందుకు గెలిపించాలంటే..
తెలుగు వారిని అన్ని విధాలా ప్రోత్సహించడంతోపాటు.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేయడంలో సునీల్ పాంత్రా కృషి అమోహం. ఖండాంతరాలకు వెళ్లినా.. తెలుగు వారి సంస్కృతిని పరిరక్షించడంలోను, అభివృద్ధి చేయడంలోను సునీల్ పాంత్రా నిరంతరం శ్రమించారు. ఇలాంటి నాయకుడిని గెలిపించుకోవడం తెలుగు వారికి మనందరికీ గర్వకారణం. కాబట్టి ఇంక ఆలస్యం ఎందుకు.. సునీల్ పాంత్రాను గెలిపించుకుని మనల్ని మనం గౌరవించుకుందాం. మన తెలుగు సంస్కృతికి, సంప్రదాయానికీ పట్టం కడదాం.