తీహార్ జైల్లో విశాలమైన ఆఫీస్. అందులో టీవీ, ఫ్రిడ్జ్, డబుల్ కాట్ బెడ్ కమ్ ఏసీ, సొంత వంటవాడు, ఎవరికి కావాలంటే వాళ్ళకు భారీ ఎత్తున పార్టీలివ్వటం. ఇదంతా ఏదైనా సినిమాలో సీన్ అనుకుంటున్నారా ? కానేకాదు. 2017 నుండి ఢిల్లీలోని తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సుకేశ్ చంద్రశేఖర్ వ్యవహారం ఇదంతా. రకరకాల పేర్లతో ప్రముఖులను, సెలబ్రిటీలకు ఫోన్లు చేసి పరిచయం చేసుకోవడం, ఖరీదైన బహుమతులు ఇచ్చి సన్నిహితం పెంచుకోవటం సుకేశ్ కు వెన్నతో పెట్టిన విద్యట.
మనీల్యాండరింగ్, మోసాలు తదితర ఆరోపణలతో సినీనటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఎప్పుడో అరెస్టయి జైలులో ఉన్న సుకేశ్ వ్యవహారాలు ఇపుడు జాక్వెలిన్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. ఇదే సమయంలో ఆయన భార్య లీనా మారియా పాల్ ఈడీకి చెప్పిన వాంజ్మూలంలో అనేక ఆశ్చర్యమైన విషయాలు వెలుగు చూశాయి. తీహార్ జైలులో తానున్న గదిని సుకేశ్ తన సొంత ఆఫీసులాగ చూసుకునేవాడట.
తనకోసం ఎప్పుడూ ఎవరో ఒక సెలబ్రిటీ వస్తునే ఉండేవారట. సుకేశ్ కు మొదటి నుండి విలాసవంతమైన జీవితం గడపటమంటే చాలా ఇష్టం. అందుకనే బిగ్ షాట్లను మోసం చేసి సంపాదించిందంతా హీరోయిన్లకు, సెలబ్రిటీలకు, వాళ్ళ కుటుంబాలకు ఖర్చు చేసేవాడని స్వయంగా ఆయన భార్యే చెప్పింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహి లాంటి హీరోయిన్లు, సెలబ్రిటీలు రెగ్యులర్ గా తీహార్ జైలుకు వచ్చి సుకేశ్ తో కాసేపు సరదాగా గడిపేసి వెళ్ళేవారట.
తనకోసం వచ్చేవాళ్ళని అడ్డుకోకుండా, బయటనుండి తనకోసం ఎవరు ఏమి తెచ్చినా తనిఖీలు, అడ్డుకోవటం గట్రా చేయకుండా సుకేశ్ జైలు అధికారులతో మంచి సంబంధాలు మైన్ టైన్ చేసేవాడట. లంచాల రూపంలోనే జైలు అధికారులకు ఈ కేటుగాడు నెలకు కోటి రూపాయలు ఖర్చు చేసేవాడంటే ఆశ్చర్యంగానే ఉంటుంది వినటానికి. అందరికీ ఖరీదైన కార్లు, వాచీలు, గుర్రాలు, మొబైల్ ఫోన్లు, భారీగా డబ్బు, బంగారు ఆభరణాలు, వజ్రాలు, కొందరికి ఖరీదైన ప్రాంతాల్లో ఫ్లాట్లు కూడా అందించేవాడని అతని బార్యే చెప్పింది.
సుకేశ్ 24 గంటలూ ప్రముఖుల గురించి వాళ్ళకున్న బొక్కల గురించే వెతికేవాడట. తన పరిశీలనలో ఎవరైనా ప్రముఖుడు పడితే అంతే సంగతులు. తనను తాను ఏదో కీలకమైన శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారిని అని పరిచయం చేసుకోవటం, సదరు ప్రముఖుడితో మాట్లాడటం, ఆయనలోని బొక్కలన్నీ వివరించటం తర్వాత మెల్లిగా బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టడం. సుకేశ్ జీవితమంతా ఇంతేనట.
ఒకసారి అవతలి వ్యక్తి బొక్కల గురించి మాట్లాడగానే సదరు వ్యక్తి అడిగినంత డబ్బు ఇచ్చుకునే వాడట. దాంతో డబ్బు అవసరమైనపుడల్లా సుకేశ్ ఇదే పనిచేసేవాడని ఆయన భార్యే చెప్పింది. అందుకనే సుకేశ్ మామూలోడు కాదంటున్నారందరు.
Here's what Jacqueline Fernandez told ED as she revealed how Sukesh Chandrashekhar conned her. #ITVideo #India #ExtortionCase #SukeshChandrashekhar pic.twitter.com/jTuSPX06XT
— IndiaToday (@IndiaToday) December 18, 2021