రాష్ట్రంలో రాతి యుగం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవే దన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలని సూచించారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులపై దాడు లు.. మీడియా కార్యాలయాలపై తెగబడుతున్నారంటూ.. వైసీపీ కార్యకర్తలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇదంతా ఉద్దేశ పూర్వక దాడి“ అని పేర్కొన్నారు. దీని వెనుక తాడేపల్లి హస్తం ఉందని అన్నారు.
అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఓ మహిళపై దాడి చేసి ఆమె దృష్టి కోల్పోయేంతగా చితకబాదిన ఘటన పైనా చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నరహంతక పాలనలో రాష్ట్రం పూర్తిగా రాతియుగంలోకి వెళ్లిపో యిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసమ్మతి గళాలపై దాడులను, అరాచకాన్ని ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తుం డగా… వైసీపీ రౌడీ మూకలకు అడ్డే లేకుండా పోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
సమస్య చెబితే దాడులా?
టీడీపీ నేతలకు తన సమస్య చెప్పిన పాపానికి దాడి చేసి ఒక వితంతు మహిళ కంటి చూపు పోగొట్టిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. భర్త లేకపోయినా.. దివ్యాంగుడైన కొడుకుతో జీవితాన్ని గడుపుతున్న ఒక పేద మహిళపై ఇంతటి దాష్టీకమా? అని మండిపడ్డారు. ప్రతిపక్షాలు, మీడియాతో పాటు సామాన్య ప్రజలపైనా దాడులు నిత్యకృత్యం అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“మన రాష్ట్రం ఎటుపోతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో హంసవేణి కంటి చూపు కోల్పోయిన ఘటనపై ముఖ్యమంత్రి స్పందించాలి. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి“ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.