https://www.youtube.com/watch?v=A425GOn533E&t=365s&ab_channel=BhakthiTV
ముచ్చింతల్ దివ్యక్షేత్రంలో జరిగిన సహస్రాబ్ది ఉత్సవాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఆయన సమతా మూర్తి విగ్రహంతో పాటు 108 దివ్య ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చిన జీయర్ స్వామి సంకల్పం వల్లే ఇదంతా సాధ్యమైందని అన్నారు.
విజయవాడలో చిన జీయర్ స్వామి చేసిన ప్రవచనాలను గుర్తు చేసుకున్న ఆయన, మతం, కులాలకు అతీతంగా సానుకూల దృక్పథంతో ఆయన మాట్లాడిన మాటలు తన మనసుకు స్ఫూర్తినిచ్చాయని వెల్లడించారు.
ఆయన జగద్గురువు అనడం కంటే ఒక విప్లవ కారుడు అనడం ద్వారా మనం ఎక్కువ భక్తిని ప్రదర్శించినట్టు చెప్పొచ్చు అన్నారు.
‘శ్రీరామానుజ స్వామివారి ఉత్సవాల్లో నేను భాగం కావడం విశేషం’ అని జనసేన అధినేత అన్నారు. హిందూ మతం యొక్క ఆదర్శాలు మరియు తత్వశాస్త్రం ప్రజలందరినీ ఏకం చేస్తాయని కూడా ఆయన పేర్కొన్నారు.