వద్దురా….సోదరా….పెళ్లంటే నూరేళ్ల మంటరా…ఆదరా…బాదరా…నువ్వె
పెళ్లి అనే ప్రమాదం గురించి యువతను హెచ్చరించడానికి స్టార్ కపుల్స్ విడాకులు ట్రెండ్ సెట్టర్లుగా నిలుస్తున్నాయని వర్మ షాకింగ్ కామెంట్లు చేశారు. వివాహ బంధం అనేది బాధాకరమైన బంధం అని, ఇది దుష్ట పూర్వీకులు కనిపెట్టారని అన్నారు. పెళ్లి తర్వాత ప్రేమ ఎక్కువ రోజులు ఉండదని, పెళ్లైన 3 నుండి 5 రోజుల తర్వాత ఆ ప్రేమ పోతుందని సెలవిచ్చారు. పెళ్లి అనే జైలుకు వెళ్లకుండా అవగాహన ఉన్నంత వరకు ప్రేమించుకుంటూ వెళ్లడమే ఆనంద రహస్యమని వర్మ స్వామి హితబోధ చేశారు.
ఇక, తెలివైన వ్యక్తులు ప్రేమిస్తారని, తెలివి తక్కువ వ్యక్తులు పెళ్లి చేసుకుంటారని సెటైర్ వేశారు వర్మ. విడాకులు మాత్రమే సంగీత్తో జరుపుకోవాలని, ఒకరి ప్రమాదకర లక్షణాలను మరొకరు తెలుసుకునే పెళ్లి అనే తంతు నిశ్శబ్దంగా జరగాలని వర్మ సందేశమిచ్చారు. ఇటీవల సమంత-నాగ చైతన్య, తాజాగా ధనుష్-ఐశ్యర్యల విడాకుల నేపథ్యంలో పెళ్లి, విడాకుల గురించి వర్మ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.