• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

దుమ్మురేపిన కాలభైరవ, రాహుల్…స్టాండింగ్ ఒవేషన్

admin by admin
March 13, 2023
in Around The World, Movies, Trending
0
0
SHARES
619
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

అంతా అనుకున్నట్లుగానే ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ అదరగొట్టింది. నాటు నాటు అంటూ తారక్, చెర్రీలు వేసిన ఊర నాటు స్టెప్పులు ఆర్ఆర్ఆర్ సినిమాకు…యావత్ భారతీయులకు..ప్రత్యేకించి తెలుగువారికి ఆస్కార్ అవార్డును…అమితానందాన్ని తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలోనే లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ అట్టహాసంగా జరుగుతున్న 95వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంంలో ఆర్ఆర్ఆర్ టీం మరో అరుదైన అవకాశం దక్కించున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ముందు ఆస్కార్ వేదిక పై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ‘నాటు నాటు’ సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది.

ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ వేదికపై ఇద్దరు తెలుగు సింగర్స్ లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చి దుమ్మురేపారు. రాహుల్, కాలభైరవలు నాటు నాటు పాట పాడాల్సిందిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఆహ్వానించగా…ఆ ఇద్దరూ స్టేజిపైకి వచ్చి పాట పాడారు.

Proud moment for #Bollywood and #India💕 #DeepikaPadukone announced #RRR’s #NaatuNaatu performance at #Oscars pic.twitter.com/cMlyzqpV67

— Bollywood Knocks (@BollywoodKnocks) March 13, 2023

అమెరికన్ డాన్సర్స్ స్టేజి పై లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తుండగా…వారి మధ్యలో నిలబడి రాహుల్, కాలభైరవలు ఆడిపాడి అందరినీ అలరించారు. సమయాభావం వల్ల నాటు నాటు సాంగ్ మొత్తం పాడే అవకాశం లేకపోవడంతో… పాటలోని పల్లవి, రెండో చరణం పాడి పాటను ముగించేశారు. తెలుగోడి సత్తా చాటేలా రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడిన నాటు నాటు పాటకు డాల్బీ థియేటర్ దద్దరిల్లిపోయింది. దీంతో, ఈ పాటకు థియేటర్లోని వారంతా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.

అంతకు ముందు వేరే పాటలను మరి కొందరు సింగర్స్ పాడగా…వాటికి కేవలం చప్పట్లు కొట్టి ఊరుకున్న దిగ్గజ నటీనటులు…నాటు నాటు పాటకు మాత్రం నిల్చొని మరీ కరతాళ ధ్వనులతో గౌరవించారు. ఆస్కార్ వేదికపై ఒక తెలుగు పాట లైవ్ పర్ఫార్మెన్స్ కు అవకాశం రావడమే ఒక ఘనత అయితే..ఆ పాటకు హాలీవుడ్ దిగ్గజ నటులు, దర్శకులు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం మరో అరుదైన గౌరవం.

ఇక, ఈ అవార్డుల ప్రదానోత్సవతానికి రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, సెంథిల్ కుమార్, కీరవాణి, చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, ఉపాసన, ప్రణీత, రాజమౌళి తనయుడు కార్తికేయలతోపాటు ఆర్ఆర్ఆర్ చిత్ర టీం నుంచి ఆస్కార్ నామినేట్ అయిన వారంతా హాజరయ్యారు. ప్రస్తుతం ఆ లైవ్ పర్ఫార్మెన్స్ వీడియో వైరల్ అయింది.

Here's the energetic performance of "Naatu Naatu" from #RRR at the #Oscars. https://t.co/ndiKiHeOT5 pic.twitter.com/Lf2nP826c4

— Variety (@Variety) March 13, 2023

Tags: deepika padukonekala bhairavalive performancenaatu naatu songRahul sipliganjRRRstanding ovation
Previous Post

మరో చరిత్ర…‘నాటు నాటు’ కు ఆస్కార్

Next Post

ఆస్కార్ తర్వాత కీర‌వాణి ఫస్ట్ రియాక్ష‌న్ వైరల్

Related Posts

Trending

ఉండవల్లి కాదు ఊసరవెల్లి…అయ్యన్న పంచ్ అదిరింది

September 28, 2023
Trending

బాబు అరెస్టు.. కేటీఆర్ వర్సెస్ లోకేష్

September 28, 2023
Trending

గ్యాంగ్ రేప్ పై స్పందించవా జగన్?: పవన్

September 28, 2023
Trending

వారిని గుర్తుపెట్టుకుంటా..భువనేశ్వరి వార్నింగ్

September 27, 2023
Trending

హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్

September 27, 2023
Trending

చంద్రబాబు పిటిషన్ విచారణకు సుప్రీం జడ్జి నో…వాయిదా

September 27, 2023
Load More
Next Post

ఆస్కార్ తర్వాత కీర‌వాణి ఫస్ట్ రియాక్ష‌న్ వైరల్

Latest News

  • బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు
  • ఉండవల్లి కాదు ఊసరవెల్లి…అయ్యన్న పంచ్ అదిరింది
  • వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు
  • జగన్ చేసిన తప్పే స్టాలిన్ కూడా..
  • బాబు అరెస్టు.. కేటీఆర్ వర్సెస్ లోకేష్
  • గ్యాంగ్ రేప్ పై స్పందించవా జగన్?: పవన్
  • వారిని గుర్తుపెట్టుకుంటా..భువనేశ్వరి వార్నింగ్
  • 3 కోర్టుల్లోనూ చంద్రబాబు కు దక్కిన ఊరట
  • సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కొత్త వ్యూహం
  • హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్
  • చంద్రబాబు పిటిషన్ విచారణకు సుప్రీం జడ్జి నో…వాయిదా
  • బాలినేని కి ‘సస్పెన్షన్’ షాకిచ్చిన అమంచి
  • సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ అనంతబాబు..జగన్ ప్రోగ్రాంకు?
  • పోలీసులకు పరిటాల సునీత వార్నింగ్
  • నాలుగో విడత వారాహి యాత్రలో తెలుగు తమ్ముళ్లు

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra