‘తానా’ ఎన్నికలలో ప్రెసిడెంట్ ఎలెక్ట్ పదవికై ‘శ్రీనివాస గోగినేని’ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.రమారమి గత 20 సంవత్సరాలుగా ‘తానా’ కార్యక్రమాల్లో పాల్గొని, 12 సంవత్సరాలుపైగా అనేక పదవులు విజయవంతంగా నిర్వహించి అమెరికా వ్యాప్తంగా గుర్తింపు కలిగి ఉన్నారు.ముఖ్యంగా 2015-17 ‘తానా ఫౌండేషన్ చైర్మన్ ‘గా అయన చేసిన సేవలను గూర్చి, అమెరికా లోనే కాక ెండు తెలుగురాష్ట్రాల్లోనూ ,అనేకమంది ఇప్పటికీ ప్రశంసిస్తుంటారు.ముఖ్యం గా అమెరికా లోని సుమారు 20 రాష్ట్రాల్లో “మన ఊరికోసం” నినాదంతో మొదలుపెట్టి చేసిన ‘5కే రన్స్’ కార్యక్రమాల మూలంగా ‘తానా’ సంస్థ సేవలపై ప్రత్యేక అవగాహనా కల్పిస్తూ సమీకరించిన కోట్లాది రూపాయలను,తెలుగు రాష్ట్రాల్లో “చైతన్య స్రవంతి” కార్యక్రమం ద్వారా కంటి చూపు క్యాంపులు, కాన్సర్ నివారణ క్యాంపులు, గ్రహణం మొర్రి సర్జరీస్,డిజిటల్ మరియు పుస్తక లైబ్రరీస్,రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు, విద్యార్థి స్కాలర్షిప్ లు, వారధి ద్వారా అనేకమంది పిల్లలకు చదువులు మొదలైన కార్యక్రమాలకు ఖర్చు చేసి, వేలాది మందికి లబ్ది కలిగించారు.అంతేగాకా ‘తానా’ కాన్ఫరెన్స్ సెక్రటరీ గాను,’తానా ‘ బోర్డు లోను, బై లాస్ కమిటీ మొదలు అనేక పదవుల్లో విశిష్ట సేవలందించారు.’తానా’ లో సంస్థాగతంగా నెలకొన్నపెత్తందారీ వ్యవస్థను, ధన ప్రాబల్యంతోను, బలవంతపు బాలట్ కలెక్షన్ తోనూ నిర్వహించే ఎన్నికల తంతును బహిరంగంగా విమర్శిస్తుంటారు.
ఇప్పుడు కూడా ‘తానా మనందరిదీ’ అంటూ పోటీ చేస్తూ కొత్త సంస్కరణలు,విలువల పరిరక్షణతో ‘తానా’ ను తిరిగి గర్వపడేలా చేయడంలో తనతోపాటు కల్సిరావాలని కోరుతూ సభ్యులందరికీ ‘నూతన సంవత్సర శుభాకాంక్షలు’ తెలియచేసారు.