సంచలన నిర్ణయం... రామతీర్థం గుడికి చంద్రబాబు
చంద్రబాబు మీద ఒంటికాలిపై లేచే బీజేపీ ఏపీ అధ్యక్షుడు తాము హిందుత్వ పరిరక్షకులు అని చెప్పకుంటూ ఏకంగా రాముడి మూలవిరాట్ విగ్రహం నుంచి తలను వేరు చేస్తే సరైన రక్షణ కల్పించలేని ప్రభుత్వం పై ధర్నా కూడా చేయలేదు. పైగా ఈరోజు జగన్ గారూ దయతల్చండి అన్నట్లు సుతిమెత్తగా ట్వీటు వేస్తున్నారు.
హిందు ఆలయాలపై వరుస దాడులు జరుగుతూ రాష్ట్రంలో హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దేశంలో హిందు ఆలయాలపై ఎక్కడ దాడి జరిగినా అన్ని రాష్ట్రాల్లో స్పందించే బీజేపీలో ఏపీలో ఆలయాలపై దాడులు చేస్తుంటే అన్ని రాష్ట్రాల్లో సైలెన్సే. కనీసం తోటి తెలుగురాష్ట్రం బీజేపీ శాఖ కూడా దీనిపై తీవ్రంగా స్పందించలేదు.
పోనీ అదేమైనా ఈ మధ్యనే కట్టిన చిన్నగుడి కూడా కాదు. ఎంతో ప్రాశస్త్యం ఉన్న అత్యంత పురాతన ఆలయం. హిందువుల వ్యక్తిత్వ , జీవన విధానాలకు ప్రతీక దైవంగా ఆరాధించే రాముడి ఆలయంలో జరిగిన ఈ అరాచకంపై బీజేపీ వ్యవహరించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తుండగా... అంత పెద్ద ఆలయంలో కనీస రక్షణ లేకపోవడం ఏంటో అర్థం కాని పరిస్థితి. ఇంతవరకు సీసీ ఫుటేజీ కూడా బయటకు రావడం లేదు అంటే దీనికి కారణాలు అంతుపట్టడం లేదు.
మొన్న రామతీర్థం, నిన్న రాజమహేంద్రవరంలో దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం చేశారు. జగన్రెడ్డి సీఎం అయ్యాక హిందువుల మనోభావాలు గాయపరిచేలా ఆలయాలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. ఇప్పటివరకూ 125కి పైగా గుడులలో విధ్వంసాలు జరిగినా ఒక్క నిందితుడిని పట్టుకోలేదు.(1/2) pic.twitter.com/jnTk8XmRZS
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) January 1, 2021
ఈ నేపథ్యంలో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు రైతుల కోసం, కార్యకర్తల కోసం నిత్యం లోకేష్ రోడ్ల మీద తిరుగుతుంటే... హిందువుల మనోభావాలు ఘోరంగా దెబ్బతిన్న నేపథ్యంలో చంద్రబాబు రామతీర్థం ఆలయం సందర్శించాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. రామతీర్థం ఘటన జరిగిన రెండు రోజులకే రాజమండ్రిలో మరో ఆలయలో విగ్రహం ధ్వంసం చేయడం వెనుక కుట్రకోణం బయటపెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
హిందువుల ఆవేదనకు అద్దంపడుతూ వారి తరఫున నిరసన వ్యక్తంచేస్తూ పరిస్థితిని పరిశీలించడానికి చంద్రబాబు రామతీర్థం ఆలయాన్ని సందర్శించనున్నట్లు పార్టీ ప్రకటించింది.
వైసీపీ ప్రభుత్వంలో ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. విజయనగరం జిల్లా రామతీర్థంలోని బోడికొండపై 400 ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి తల భాగాన్ని వేరుచేసి ఎత్తుకెళ్ళిన ఘటనపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది pic.twitter.com/tFIjrO59e5
— Telugu Desam Party #StayHomeSaveLives (@JaiTDP) December 31, 2020
చంద్రబాబు పర్యటనతో ఉత్తరాంధ్రలో టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్తేజం కలగనుంది. అలాగే హిందువుల్లో ఏకత్వానికి, దేవాలయ పరిరక్షణ ఉద్యమానికి ఈ నిర్ణయం తోడ్పడే అవకాశం ఉంటుంది.
శనివారం రామతీర్థం లో మాజీ సీఎం చంద్రబాబు ఉదయం 11.00 గంటలకు మెట్లు మార్గాన బొడికొండ ఎక్కనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాక కోసం రామతీర్థం ల్ ఏర్పాట్లు ను పరిశీలిస్తున్నా విజయనగరం పార్లమెంట్ అద్యక్షులు నాగార్జున కిమిడి (కింది ఫొటో)
