అనేక సంక్షోభాల్లో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో జనాల తిరుగుబాటు మొదలైంది. శుక్రవారం కొలంబోలోని అధ్యక్షుడు రాజపక్సే నివాస భవనం ముందు వందలాది జనాలు పెద్దఎత్తున నిరసనలు, ఆందోళనలకు దిగారు. ఆందోళనలు అదుపు తప్పడంతో పోలీసులు భాష్పవాయువు ప్రయోగం చేయాల్సొచ్చింది. ఈ గొడవల్లో పోలీసులకు గాయాలవ్వటమే కాకుండా పోలీసులు వాహనాలను జనాలు ధ్వంసం చేసేశారు. మామూలు జనాలకు కూడా పెద్దగానే గాయాలయ్యాయి. అంతేకాకుండా 54 మందిని పోలీసులు అరెస్టులు చేశారు.
ఎప్పుడైతే కొలంబోలో అధ్యక్ష భవనం ముందు పెద్ద ఎత్తున గొడవలయ్యాయో వెంటనే కొలంబోలోని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. అల్లర్లు మరింతగా పెరగకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకుంది. కొద్దిరోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లోని జనాలకు తినడానికి కడుపునిండా తిండి కూడా దొరకటం లేదు. నిత్యావసరాల్లో ఏది కొనాలన్నా కొనలేనంతగా ధరలు ఆకాశాన్నంటాయి.
పెట్రోలు, డీజల్, గ్యాస్ అయితే వేలల్లో ఉన్నాయి. కిలో బంగాళదుంపలు, బ్రెడ్డు, పంచదార లాంటివి మధ్య తరగతి జనాలు కొనుగోలు చేసి చాలా రోజులైందట. ఇవన్నీ సరిపోవన్నట్లుగా రోజుకు 17 గంటల విద్యుత్ కొరతతో జనాలు అల్లాడిపోతున్నారు. మొత్తం దేశమంతా ఇదే పరిస్ధితులున్నాయి. దాంతో ముందుగా కొలంబోలో జనాలు రాజపక్సే మీద తిరగబడ్డారు. అధ్యక్షుడి నిర్వాకం వల్లే తమకు ఇన్ని కష్టాలు వచ్చాయని ఆరోపిస్తూ ఆయన రాజీనామాను డిమాండ్ చేశారు.
శ్రీలంకలో ఇలాంటి పరిస్థితి రావటానికి చాలా కారణాలున్నాయి. ప్రభుత్వ విధానాలు సక్రమంగా లేకపోవటం, అధ్యక్షులుగా పనిచేసిన వారి తప్పుడు నిర్ణయాల ఫలితంగా ఇపుడు జనాలు అల్లాడిపోతున్నారు. ఒకవైపు జనాలు కడుపుమంటతో రగిలిపోయి ఆందోళనకు దిగితే ప్రభుత్వం మాత్రం ప్రజలది ఉగ్రవాద చర్యగా అభివర్ణిస్తోంది. తన చేతకానితనాన్ని, పాలనలో ఫెయిల్యూర్లను ప్రభుత్వం అంగీకరించటం లేదు. కొలంబోలో జనాలు తిరగబడతారని అందరు ఊహించిందే కానీ ఆ తిరుగుబాటు ఇంత తొందరగా మొదలవుతుందని మాత్రం ఊహించలేదు. చివరకు ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి.
#GayaPakistan
✅#Srilanka took huge debts from #China under #BRI Border Road Initiative
✅Sri Lanka fell trap to China's debt trap diplomacy.
✅#Pakistan already under huge debts from #China under #CPEC project.After #SriLankaCrisis its turn of #BeggarPakistan #ImranKhan pic.twitter.com/qnh5XiNjy5
— Sunaina Bhola (@sunaina_bhola) April 1, 2022
శ్రీలంక దారిలో ఏపీ
ఏపీలో కూడా శ్రీలంక వంటి అసమర్థ పాలన సాగుతోందని తెలుగుదేశం విమర్శిస్తోంది. దేశమంతటా ఒకరకమైన ధరలుంటే ఏపీలో ఒక రకమైన ధరలు ఉన్నాయంటోంది. ఏపీలో పెట్రోలు, డీజిలు, కరెంటు, పన్ను రేట్లు, ప్రత్యేక పన్నులు ప్రజలను పేదలుగా మారుస్తున్నాయని అంటున్నారు. ప్రజలు మేలుకోకపోతే 2025 నాటికి ఏపీ సీఎం జగన్ రాష్ట్రాన్ని దివాలా తీయిస్తారని చెప్పారు. శ్రీలంక పరిస్థితికి మనం ఎంతో దూరంలో లేము అన్నారు.