గత కొద్దిరోజులుగా ఓ పోలీసు ఉన్నతాధికారిని ఉద్దేశించి ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మహాసేన రాజేష్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయనపై ఓ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. 2 గంటలకు పైగా రాజేష్ ను పోలీసులు విచారణ జరిపారని తెలుస్తోంది. ఆ తర్వాత తమ వాహనాలు వదిలి వెళ్లాలని, తమ ఫోన్ ను ఇతర వస్తువులనూ తీసుకున్నారని రాజేష్ ఆరోపిస్తున్నారు.
ప్రధానంగా అంబేద్కర్ ఆశయాలతో నడిచే ఓ సంస్థను టార్గెట్ చేస్తూ రాజేష్ వ్యాఖ్యలు చేయడం, వాటికి టీడీపీ, జనసేనలు మద్దతు పలకడం విశేషం. అంబేద్కర్ ఇండియా మిషన్ పేరిట జరుగుతున్న తప్పిదాలను రాజేష్ ప్రశ్నించిన తర్వాతే ఆయనపై కేసు నమోదైందని తెలుస్తోంది. ఆ సంస్థకు చెందిన కొందరు పోలీస్ పవర్స్ ను మిస్ యూజ్ చేస్తున్నారని, ఆ సంస్థను రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అత్యున్నత స్థాయి అధికారి నిర్వహించడమే కారణం అని రాజేష్ చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి.
ఎయిమ్ పేరిట తిరుగుతున్న వ్యక్తుల్లో కలవరానికి రాజేష్ ఆరోపణలే కారణమన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఇదే సంస్థపై చాలా ఆరోపణలు వచ్చాయి. పోలీసు స్టేషన్లలో రౌడీ షీట్లు ఓపెన్ అయిన వ్యక్తులే ఆ సంస్థలో సభ్యులుగా ఉన్నారని శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా నడిచే కొన్ని స్థానిక పత్రికలు ఆరోపణలు గుప్పించాయి. వాటికి మహాసేన రాజేష్ చేసిన ఆరోపణలు కూడా మరింత బలం చేకూర్చాయన్న వాదనలున్నాయి.
ఏదేైమైనా ఎక్కడో గోదావరి జిల్లాల్లో పనిచేసుకునే మహాసేన రాజేష్ ను శ్రీకాకుళం టూ టౌన్ స్టేషన్ కు పిలిపించి మాట్లాడడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది.