• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తత్వం బోధ పడ్డా తప్పు చేస్తున్న దిల్ రాజు?

NA bureau by NA bureau
July 21, 2022
in Movies, Top Stories
1
0
SHARES
116
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
బంగారు గుడ్లు పెడుతున్న బాతును అత్యాశతో కోస్తే ఏమవుతుంది.. రోజు వచ్చే బంగారు గుడ్డు మాత్రమే కాదు.. గుడ్డు పెట్టే బాతు కూడా పోతుంది. ఈ చిన్న పిట్టకథను టాలీవుడ్ నిర్మాతలు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే మంచిది. గతంలో ఎప్పుడూ లేని రీతిలో సినిమా ప్రచారంలో.. ‘అతి తక్కువ ధరలతో టికెట్లు’ అంటూ సినిమాకు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే.. పెద్ద హీరోల కాసుల కక్కుర్తి.. వారితో సినిమాలు తీసే నిర్మాతల అత్యాశేనని చెప్పాలి.

మారిన కాలానికి తగ్గట్లుగా మారాలన్న చిన్న విషయాన్ని టాలీవుడ్ నిర్మాతలు దాదాపుగా మర్చిపోవటం.. తమ సినిమా విడుదల వేళలో మాత్రమే తప్పించి.. విడి రోజుల్లో దాని గురించే పట్టించుకోకపోవటం తెలిసిందే. కరోనా దెబ్బకు థియేటర్లు నెలల తరబడి మూతపడటం.. వినోదం కోసం టీవీల్ని ఆశ్రయించిన వేళ.. ఓటీటీ ఫ్లాట్ ఫాంలో సినిమాలు చూసే అలవాటు అనుకున్న దాని కంటే ఎక్కువగా ఉండటం.. సినిమాల కోసం ప్రత్యేకంగా థియేటర్లకు వెళ్లాల్సిన అవసరం లేని పరిస్థితి చోటు చేసుకుంది.

దీనికితోడు.. కరోనా కారణంగా తమకు పోయిన ఆదాయాన్ని తిరిగి తెచ్చుకునేందుకు వీలుగా.. కాస్తంత క్రేజ్ ఉన్న మూవీ అయితే చాలు తమ ఇష్టానికి తగ్గట్లు టికెట్ల ధరల్ని డిసైడ్ చేయటమే తప్పించి.. ప్రేక్షకులందరికి అందుబాటులో ఉండాలన్న చిన్న పాయింట్ ను నిర్మాతలు మర్చిపోయారు. దీనికి తోడు తమ ప్రయోజనం పూర్తి అయితే చాలు అనే మైండ్ సెట్ తప్పించి.. అందరూ బాగుంటే.. మనం కూడా బాగుంటామన్న చిన్న పాయింట్ ను టాలీవుడ్ నిర్మాతలు మిస్ అయ్యారనే చెప్పాలి.

ఆ విషయం అర్థమయ్యేసరికి జరగాల్సిన నష్టం వాటిల్లిపోయింది. థియేటర్లలో సినిమాల్ని తక్కువ ధరలకు చూపిస్తామని తమ ప్రచార చిత్రాల్లోనూ ప్రకటించుకోవాల్సిన దుస్థితి ఇప్పుడు నెలకొంది. అయినప్పటికీ పలువురు నిర్మాతలకు జరిగిన నష్టం గురించి సీరియస్ గా తీసుకొని.. మరింకేమీ చేయాలన్న దానిపై మెదడుకు మేత పెడితే.. పరిస్థితి మరోలా ఉండేది. అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. స్టార్ ఇమేజ్ తో ఏం చేసినా నడిచిపోతుందని భావిస్తే అంతకు మించిన పెద్ద తప్పు ఇంకొకటి ఉండదు.

తాజాగా నాగచైతన్యతో థ్యాంక్యూ మూవీని నిర్మించారు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. విడుదల కాకున్న ఈ సినిమాకు సంబంధించి.. టికెట్ల ధరల గురించి తాను ఒకటి చెబితే.. మరొకటి మీడియా ముందుకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఇంతా చేసి.. సింగిల్ థియేటర్లలో రూ.వంద మూవీ.. అదే సమయంలో మల్టీ ఫ్లెక్సుల్లో రూ.200 ప్లస్ టాక్సులు ఉంటాయని చెబుతున్నారు. పెద్ద హీరోల సినిమాలకు ఆ మాత్రం ధర ఉంటే ఏముందన్న వాదన దిల్ రాజు నోటి నుంచి వచ్చింది.

ఇప్పటికే ఓటీటీ కారణంగా చిన్న.. ఒక మోస్తరు సినిమాల్ని చూసేందుకు థియేటర్లకు రావటం తగ్గించేసిన వేళ.. పెద్ద హీరో పేరు చెప్పి.. టికెట్ల ధరల్ని భారీగా వసూలు చేసే వైనానికి ఎదురవుతున్న చేదు అనుభవాల మీద అవగాహన ఉండి కూడా దిల్ రాజు లాంటి అగ్రశ్రేణి నిర్మాత.. తన వరకు వచ్చేసరికి అసలు విషయాన్ని మర్చిపోయి.. కాసుల కక్కుర్తిని ప్రదర్శిస్తున్న వైనం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. ఇదంతా చూశాక.. దిల్ రాజు లాంటి వ్యక్తి సైతం తప్పులు చేయటమా? అనిపించక మానదు.

Tags: bigh hero moviesdil raju doing same mistakelow ticket pricesproducer dil rajuthank you movie ticket priceticket prices in telangana
Previous Post

ట్రైలర్ రిలీజ్ కే 75 అడుగుల కటౌటా?

Next Post

మహాసేన రాజేష్ పై పోలీసుల కన్ను

Related Posts

Top Stories

రామోజీతో అమిత్ షా భేటీ..నేరుగా ఫిలింసిటీకి

August 20, 2022
Movies

కమిట్మెంట్ పై తేజస్వి మదివాడ హాట్ కామెంట్స్

August 19, 2022
Trending

జడ్జిలపై వెంకట్రామిరెడ్డి షాకింగ్ కామెంట్స్

August 19, 2022
gorantla madhav
Top Stories

రాజీనామాపై చంద్రబాబుకు గోరంట్ల సవాల్

August 19, 2022
Trending

గోరంట్లకు సరే జగన్ కూ సిగ్గులేదా?: చంద్రబాబు

August 19, 2022
Movies

ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరీ

August 19, 2022
Load More
Next Post

మహాసేన రాజేష్ పై పోలీసుల కన్ను

Comments 1

  1. Pingback: తత్వం బోధ పడ్డా తప్పు చేస్తున్న దిల్ రాజు? - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • రామోజీతో అమిత్ షా భేటీ..నేరుగా ఫిలింసిటీకి
  • కమిట్మెంట్ పై తేజస్వి మదివాడ హాట్ కామెంట్స్
  • జడ్జిలపై వెంకట్రామిరెడ్డి షాకింగ్ కామెంట్స్
  • రాజీనామాపై చంద్రబాబుకు గోరంట్ల సవాల్
  • గోరంట్లకు సరే జగన్ కూ సిగ్గులేదా?: చంద్రబాబు
  • ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరీ
  • పలాసలో హైటెన్షన్..టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్
  • టీడీపీ పోరాటంతో అనంతబాబుకు షాక్
  • తమ ఎమ్మెల్యేపై మాజీ మంత్రి అనిల్ ఫైర్
  • కురుబలకు జగన్ ఇచ్చిన స్థానం ఇది…ట్రోలింగ్
  • కొడాలి నాని బూతులపై బండ్ల గణేష్ ఫైర్
  • బాలయ్యను టార్గెట్ చేసిన రోజా
  • జిమ్ పై సీఐడీ చీఫ్ సునీల్ షాకింగ్ కామెంట్స్
  • పవన్ కు కొడాలి నాని సవాల్
  • ఆ సినిమా దెబ్బకు ఇల్లు అమ్ముకున్న స్టార్ హీరో?

Most Read

పాలు విరిగినట్టు, విరిగిన నా దేశభక్తి!

టీడీపీ నుంచి కళా వెంక‌ట్రావు సస్పెండ్?

కవర్ చేస్కోలేక రష్మిక తిప్పలు..ట్రోలింగ్

వైఎస్ భారతి తిరుమలకు ఎందుకు వెళ్లరంటే…

అనసూయ అంత మాటనేసిందేంటి?

జగనన్న నుంచి తెలుగుకు స్వాతంత్ర్యం ఎప్పుడు?..ట్రోలింగ్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra