చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, ఆమె భర్త కల్యాణ్ దేవ్ ల మధ్య విభేదాలు వచ్చాయని కొంతకాలంగా పుకార్లు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ జంట విడిపోబోతోందని ఫిల్మ్ నగర్ లో పుకార్లు షికార్లు చేశాయి. దానికి తోడు మెగా ఫ్యామిలీ వేడుకల్లో కళ్యాణ్ దేవ్ కనిపించకపోవడం ఆ ఊహాగానాలకు ఊతమిచ్చింది. అయితే, ఆ తర్వాత శ్రీజ పుట్టినరోజు నాడు కల్యాణ్ దేవ్ ఆమెకు శుభాకాంక్షలు చెప్పడంతో పుకార్లకు చెక్ పడింది.
అయితే, తాజాగా ఆ పుకార్లకు బలం చేకూర్చేలా శ్రీజ ఇన్ స్టాగ్రామ్ లో తన పేరు మార్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో శ్రీజ కళ్యాణ్ గా ఉన్న ఇన్స్టా అకౌంట్ నుంచి తన భర్త కళ్యాణ్ పేరును శ్రీజ తొలగించడం చర్చనీయాంశమైంది. తాజాగా శ్రీజ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ‘శ్రీజ కొణిదెల’ అని కనిపించడంతో ఆ జంట విడిపోవడంపై మళ్లీ చర్చ మొదలైంది. అయితే, అధికారికంగా దంతపతులిద్దరి నుంచి ఈ విషయంపై ఎటువంటి ప్రకటన రాలేదు.
కానీ, ఇటీవల నాగచైతన్యతో విడాకులు తీసుకోవడానికి కొన్ని రోజుల ముందు సమంత కూడా ఇలాగే ఇంటిపేరు మార్చుకుంది. ప్రియాంకా చోప్రా కూడా తన పేరు చివర జోనాస్ తీసేసిందని, కానీ, విడాకులు తీసుకోలేదని నెటిజన్లు అప్పట్లో కౌంటర్లు ఇచ్చారు. కానీ, చివరకు చై, సామ్ లజోడీ విడిపోయింది. మరి, శ్రీజ-కల్యాణ్ దేవ్ ల జంట ఈ పుకార్లను కొట్టిపారేస్తుందో లేదో వేచిచూడాలి. ఏది ఏమైనా మెగా డాటర్ శ్రీజ ఇన్ స్టాలో ఇంటిపేరు మార్చడం షాకింగ్ నిర్ణయం అని నెటిజన్లు అంటున్నారు.