నందమూరి బాలకృష్ణకు ముగ్గురు సంతానం అనే సంగతి మనందరికీ తెలిసిందే. పెద్ద కుమార్తె బ్రాహ్మణి నారా లోకేష్ ను వివాహం చేసుకుని ప్రస్తుతం వ్యాపార రంగంలో సత్తా చాటుతున్నారు. కుమారుడు మోక్షజ్ఞ తేజ బాలకృష్ణ బాటలోనే హీరోగా సినీ రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇక మిగిలింది తేజస్విని. విదేశాల్లో స్టడీస్ కంప్లీట్ చేసిన ఆమె.. 2013లో గీతం గ్రూప్ అధినేత ఎంవీవీఎస్ మూర్తి మనవడు శ్రీ భరత్ ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు.
అయితే సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించడం వల్ల తేజస్వినికి ఫిల్మ్ ఇండస్ట్రీ పై మక్కువ ఏర్పడింది. కానీ ఇండస్ట్రీలోకి వచ్చేంత ధైర్యం ఆమె చేయలేదు. తండ్రి పెట్టిన ఆంక్షలు కారణంగానే తేజస్విని వెనకడుగు వేసిందని టాక్ ఉంది. అయితే పెళ్లై ఒక బిడ్డ పుట్టిన తర్వాత తేజస్విని బాలయ్య సినిమాలకు తెర వెనక పని చేస్తూ వస్తోంది. కథల ఎంపిక దగ్గర నుంచి కాస్ట్యూమ్స్ సెలక్షన్ వరకు అన్ని తానై చూసుకుంటోంది.
బాలయ్య హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ టాక్ షోకు తేజస్విని క్రియేటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరించింది. ఆమె గైడెన్స్ ప్రకారమే బాలయ్య ఈ షో ద్వారా తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. చిత్ర పరిశ్రమ పట్ల తేజస్వినికి ఉన్న డెడికేషన్ ను గమనించిన బాలయ్య ఇప్పుడు ఆమెను నిర్మాతగా పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నారట. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో త్వరలోనే నాలుగో చిత్రం పట్టాలెక్కబోతోంది. ఈ మూవీకి తేజస్విని ప్రొడ్యూసర్ గా వ్యవహరించనుందంటూ బలంగా ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తేజస్విని గురించి ఆమె భర్త మరియు టీడీపీ విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తేజస్విని సో టాలెంటెడ్ అని.. బాలయ్యకి అన్నీ తానై చూసుకుంటుందని శ్రీ భరత్ చెప్పుకొచ్చారు. అలాగే తేజస్విని సినిమాల్లోకి వచ్చి ఉంటే పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యుండేదని.. పాపులర్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకునేదని భరత్ తెలిపారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆమె క్రియేటివ్ సైడ్ వర్క్ చేయనుందని పేర్కొన్నారు.