సీమాంధ్రులారా మనను నమ్మించి మోసం చేసిన నమ్మకద్రోహి పార్టీ బీజపీకి బుద్ది చెప్పే సమయం ఆసన్నమైంది.
హైదరాబాద్ ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి మన సత్తా చాటే సమయం ఆసన్నమైంది.
అమరావతిని అగమ్యగోచరం చేసి, మనల్ని అయోమయస్థితిలోకి నెట్టేసి..
పోలవరం కట్టడానికి 20 వేల కోట్లే ఇస్తాం మీ చావు మీరు చావండని తేల్చి చెప్పేసి..
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటూ మనల్ని అపహాస్యం చేసి..
ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వకుండా మనల్ని వెధవల్ని చేసి..
రైల్వే జోన్ ఇచ్చినట్టే ఇచ్చి ఆదాయం వచ్చే ప్రాంతాలన్నీ ఒడిశాకిచ్చేసి మనల్ని బకరాల్ని చేసి..
..ఇలా అడుగడుగునా ఆంధ్రులను వంచించిన దుర్మార్గ బీజేపీని తెలుగు రాష్ట్రాల్లో ఎదగనివ్వకుండా చేయడమే లక్ష్యంగా సీమాంధ్రులు, తెలంగాణ ప్రజలు కలిసికట్టుగా పనిచేయాలి.
చాలామంది సీమాంధ్రులు ఇంకా అమాయకంగా బీజేపీని నమ్ముతున్నారు. టీఆర్ఎస్ మీద కోపంతో బీజేపీకి ఓటు వేయాలని భావిస్తున్నారు.
ఆ పని చేస్తే మనకన్నా రాష్ట్ర ద్రోహులు ఇంకెవరూ ఉండరు.
ఎందుకంటే.. సీమాంధ్రులకు టీఆర్ఎస్తో వచ్చే తక్షణ ప్రమాదం ఏమీ లేదు.
మన రాష్ట్రంతో పోటీ పడడం తప్ప మనను ఏమైనా చేయగలిగే శక్తి కేసీఆర్కు లేదు.
పైగా టీఆర్ఎస్ మనకు ప్రత్యక్ష శత్రువు.
బీజేపీ అలా కాదు. అది నమ్మకద్రోహి.
మన వెనకే అండగా ఉంటామని నమ్మించి, ఉన్నట్టు నటించి, వెన్నుపోటు పొడిచిన, పొడుస్తున్న, భవిష్యత్తులోనూ వెన్నుపోటు పొడిచే పార్టీ. అది ఉత్తర భారతీయ జనతా పార్టీ. దానికి దక్షిణాది మీద ఎలాంటి ప్రేమా లేదు. అందుకే 15వ ఆర్థిక సంఘంలో మన దక్షిణాదికి అన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంది. దక్షిణాది రాష్ట్రాలు వాటిపై ఎంత నిరసన తెలిపినా.. ఈకలా తీసిపారేస్తూ ఉత్తరాదికే మేలు చేస్తోంది.
గడచిన ఆరేళ్లలో హైదరాబాద్లో ఉన్న సీమాంధ్రులకు టీఆర్ఎస్ వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. అంతకుముందు ఎలా ఉన్నామో ఇప్పుడూ అలాగే ఉన్నాం.
పొరపాటున ఇప్పుడు మనం టీఆర్ఎస్పై కోపంతో బీజేపీకి ఓటేస్తే ఆ పార్టీ మరింత బలపడి తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ అధికారంలోకి వచ్చినా రావచ్చు. అప్పుడు ఉత్తరభారతీయ జనతాపార్టీ తదుపరి లక్ష్యం మన రాష్ట్రమే అవుతుంది. దాన్ని ఆపే శక్తి మనకు ఉండదు.
ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలన్నది ఆ పార్టీ లక్ష్యం. కానీ, ఒక్కసారి ఆలోచించండి.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పాలిత ఉత్తరాది రాష్ట్రాలు అభివృద్ధి చెందాయా? లేక ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న దక్షిణాది అభివృద్ధి చెందిందా?
దీనికి తాజా ఉదాహరణ.. ఢిల్లీ. అక్కడ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాకే కదా.. అక్కడి స్కూళ్లు, హాస్పిటళ్లు బలపడింది. అంతకుముందు అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు తాము తినడం తప్ప ప్రజలకు ఒరగబెట్టిన మేలు ఏమైనా ఉందా?
కాబట్టి ఎట్టిపరిస్థతుల్లోనూ బీజేపీ గెలవకుండా ఉండడానికి కృషి చేయడమే మన తక్షణ కర్తవ్యం.
దయచేసి.. ఇప్పటికే గడ్డు పరిస్థతుల్లో ఉన్న మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారిపోకుండా ఉండాలంటే, మన రాష్ట్రానికి ఈ దుస్థితి రావడానికి పరోక్ష కారణం కూడా అయిన బీజేపీకి వ్యతిరేకంగా కసిగా ఓటు వేసి మన సత్తా చాటాల్సిన సమయం వచ్చింది.
కొంతమంది సీమాంధ్రులు .. ఈ ఎన్నికలకు మన రాష్ట్రానికి ఏమీ సంబంధం లేదు కదా, మేం టీఆర్ఎస్కు ఎందుకు వేయాలి? బీజేపీకి వేస్తాం అంటున్నారు. మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే బీజేపీకి వెయ్యం. ఇక్కడ వేస్తే ఏమవుతుంది? అంటున్నారు.
నేనూ అదే ప్రశ్న వేస్తున్నాను. తెలంగాణలో టీఆర్ఎస్ గెలవడం వల్ల మనకు వచ్చే నష్టం ఏముంది? ఓడిపోతే వచ్చే లాభం ఏముంది. ఆ పార్టీ ప్రస్తుతం అదికారంలో ఉండడం వల్ల మనకైతే ఎప్పుడూ ఎలాంటి సమస్యా లేదు కదా?
ఇదంతా చదివి కూడా బీజేపీకి ఓటు వేస్తామంటే మీ ఇష్టం. మీ తదుపరి తరాలవారు మిమ్మల్ని ఎన్నటికీ క్షమించలేని తప్పు మీరు చేస్తున్నట్టే.